Begin typing your search above and press return to search.

ఐటం సాంగుల్లో ఉండే కిక్కే వేరు

By:  Tupaki Desk   |   18 Dec 2017 11:00 PM IST
ఐటం సాంగుల్లో ఉండే కిక్కే వేరు
X
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ మూవీ రేసుగుర్రంలో బూచాడే.. బూచాడే అంటూ తన స్టెప్పులతో అందరినీ ఒక ఊపు ఊపిన భామ కైరా దత్. ఐటం సాంగులు చేయమని తెలుగు నుంచి వస్తున్న ఆఫర్లు చూసి ఈ భామ తెగ ఉత్సాహపడిపోతోంది. తాజాగా బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పైసా వసూల్ లోనూ తన డ్యాన్సుతో కుర్రకారుతో విజిల్స్ వేయించింది.

తాజాగా కొత్త యాక్టర్లు ఆశిష్ రాజ్ సిమ్రన్ శర్మ జంటగా నటిస్తున్న ఈగో సినిమాలో మరోసారి కైరా దత్ ఐటం సాంగులో మెరిపించనుంది. ఇంతకుముందు సినిమాల్లో తాను చేసిన ఐటం నెంబర్లు చూసి ఇంప్రెస్ అయిపోవడం వల్లనే మరోసారి ఐటం సాంగ్ చేయమని అడిగారని ఆనందంగా చెబుతోంది. ‘‘అసలు ఐటం సాంగ్ చేయడం భలే ఫన్ గా ఉంటుంది. అసలు నాకు మ్యూజిక్ అన్నా.. డ్యాన్స్ అన్నా భలే ఇష్టం. ఐటం సాంగ్ అంటే ఆ రెండూ కలగలసి ఉంటాయి. ఆ పాటల కోసం డిజైన్ చేసే డ్రస్సులు.. సెట్టింగు.. హడావుడి.. పిక్చరైజేషన్ అన్నీ నాకు తెగ నచ్చేస్తాయి’’ అంటోంది కైరాదత్. ‘‘ఐటం సాంగు ప్రేక్షకుడిని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా సినిమాపై ఇంట్రస్ట్ పెరుగుతుంది. కొన్నిసార్లు సినిమా పెద్దగా ఆడకపోవచ్చు. కానీ సాంగు మాత్రం జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది.’’ అన్నది కైరాదత్ నమ్మకం.

ప్రస్తుతానికి కైరాకు తెలుగు మాట్లాడటం ఇంకా వంటపట్టలేదు. కానీ సెట్లో సంభాషణలు.. ఎదుటి వారు చెప్పేది మాత్రం బాగానే అర్ధం చేసుకోగలదట. కైరా సింగర్ కూడా. అవకాశం ఇస్తే ఓ పాట పాడేస్తాను అంటోంది. మొత్తానికి ఈ వయ్యారి వరసగా అయినా ఐటం సాంగులు చేయడానికి ఏ మాత్రం ఫీలవనని చెప్పేస్తోంది. డ్యాన్సులవీ బాగానే వచ్చు కాబట్టి మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు.