Begin typing your search above and press return to search.

సెక్సీ దత్ కు షాకిచ్చిన బాలయ్య

By:  Tupaki Desk   |   9 July 2017 5:04 AM GMT
సెక్సీ దత్ కు షాకిచ్చిన బాలయ్య
X
నందమూరి బాలకృష్ణ 101 వ సినిమా ‘పైసా వసూల్’లో.. ఇక మాఫియా డాన్ లా కనించనున్నాడు. ఇందు కోసం తన గెటప్ పూర్తిగా మార్చాడు. బాలయ్య సినిమాలు అంటే యాక్షన్ తప్పనిసరి. తమ యాక్షన్ సీనులు తామే సొంతంగా చేసే హీరోలలో బాలకృష్ణ కూడా ఉంటాడు. యాక్షన్ కోసం ఎంతటి రిస్క్ అయన చేస్తాడు బాలయ్య. లెజెండ్ సినిమాలో చాల ఫైట్ సీన్లు తానే సొంతంగా చేశాడు. అలాగే తన 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో యుద్ద సన్నివేశాలలో బాలయ్య చూపిన తెగువకు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్య పోయారు అని చెబుతుంటారు.

ఇప్పుడు వస్తున్న ‘పైసా వసూల్’లో కూడా అటువంటి సాహసమే చేస్తున్నాడు. ఆ మధ్య పోర్చుగల్ దేశంలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్లో కూడా బాలయ్య ఒక కార్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా రిస్క్ తీసుకొని తానే సొంతంగా చేశాడు. అప్పుడు అక్కడే ఉన్న నటి శ్రియ షాక్ కు గురైంది బాలయ్య పట్టుదల చూసి. ఇప్పుడు హైదరాబాద్లో ఇదే సినిమా కోసం మరో యాక్షన్ సీన్లో బాలయ్య మరో స్టంట్ చేశాడు డూప్ లేకుండా. ఈసారి తన మరో హీరోయిన్ కైరా దత్ తో కలిసి చేశాడు. అక్కడ ఈ కొత్త అమ్మడు బాలయ్య యాక్షన్ చూసి ఇలాంటి రియల్ యాక్షన్ హీరోని నేను ఎప్పుడు చూడలేదు అంటూ షాకైపోయింది.

''బాలకృష్ణ గారు నిజమైన రియల్ హీరో.. ఎందుకంటే అయన ఎటువంటి డూప్ లేకుండానే ఎంతటి కష్టమైన యాక్షన్ షాట్ అయినా తానే చేస్తున్నాడు. నిజంగా గ్రేట్ అబ్బా'' అని తెగ తబ్బిబ్బు అయి చెబుతోంది ఈ సెక్సీ దత్. ఈ సినిమాలో శ్రియ తో పాటుగా మరో కొత్త నటి ముస్కాన్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఐటం సాంగ్ కోసం వచ్చిన కైరా.. కొన్ని సీన్లలో కూడా చేస్తోందట. అది సంగతి.