Begin typing your search above and press return to search.

118 ద‌ర్శ‌కుడు.. రాజ‌శేఖ‌ర్ కూతురు

By:  Tupaki Desk   |   16 Dec 2020 9:00 AM IST
118 ద‌ర్శ‌కుడు.. రాజ‌శేఖ‌ర్ కూతురు
X
కేవీ గుహ‌న్.. ద‌క్షిణాదిన పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్. దూకుడు స‌హా చాలా సినిమాల‌కు అత‌ను ఛాయాగ్ర‌హ‌ణం అందించాడు. త‌మిళంలో ద‌ర్శ‌కుడిగా మారి ఒక‌ట్రెండు సినిమాలు తీశాడు కానీ.. అవంత మంచి ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఐతే తెలుగులో మాత్రం ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు మంచి ఆరంభ‌మే ల‌భించింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా ఆయ‌న రూపొందించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ 118 హిట్ట‌యింది. అంత మంచి ఫ‌లితం అందుకున్నాక గుహ‌న్ ఏమీ తొంద‌ర ప‌డిపోలేదు. ద‌ర్శ‌కుడిగా త‌ర్వాతి సినిమా విష‌యంలో వేచి చూశాడు. ఇప్పుడు ఓ చిన్న స్థాయి సినిమాతో రాబోతున్నాడు. అది కూడా థ్రిల్ల‌రే కావ‌డం విశేషం. సినిమా పేరు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (హూ, వేర్‌, వై).

ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివాని క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌టం విశేషం. పాట‌, గ‌రుడ వేగ‌, 24 కిసెస్ లాంటి సినిమాల‌తో గుర్తింపు సంపాదించిన అదిత్ అరుణ్ ఇందులో హీరో. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చ‌డీచ‌ప్పుడు లేకుండా చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేసుకుంది. శివానికి ఇదే తొలి విడుద‌ల కావ‌చ్చేమో. ఆమె హీరోగా మారిన ఒక‌ప్ప‌టి బాల‌న‌టుడు తేజ‌తో క‌లిసి మ‌రో సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కంటే ముందు అడివిశేష్‌తో క‌లిసి ఓ హిందీ సినిమా రీమేక్‌తో ఎంట్రీ ఇవ్వాల‌ని శివాని అనుకుంది కానీ.. ఆ సినిమా మొద‌లైన‌ట్లే మొద‌లై ఆగిపోయింది. 118తో ద‌ర్శ‌కుడిగా మంచి ప‌నిత‌నాన్నే చూపించిన గుహ‌న్.. రాజ‌శేఖ‌ర్ కూతురికి ఎలాంటి డెబ్యూ ఇస్తాడో చూడాలి మ‌రి.