Begin typing your search above and press return to search.

బజ్జీల పాపకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెడుతున్న పబ్ కేసు..!

By:  Tupaki Desk   |   11 Jun 2022 2:30 AM GMT
బజ్జీల పాపకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెడుతున్న పబ్ కేసు..!
X
ఒక్క సంఘటన ఎందరో జీవితాలనే మార్చేస్తుంది. కొందరికి అవి దురదృష్టం కలిగిస్తే.. మరికొందరరికి మాత్రం అదృష్టంగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని ఘటనలు ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ.. కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుపెడుతుంటాయి.

ఇంక వాళ్ళు సినీ ఇండస్ట్రీకి చెందిన వారైతే, ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెగిటివ్ లేదా పాజిటివ్ అనేది పక్కన పెడితే అందరూ చర్చించడం వల్ల వారికి మైలేజ్ అయితే వస్తుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని క్యాష్ చేసుకునేవారు.. దాంతోనే కెరీర్ లో ముందుకు వెళ్లేవారు ఎందరో ఉన్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందటే.. టాలీవుడ్ లో సంచనలం రేపిన ఓ ఇన్సిడెంట్ తో ఒక అప్ కమింగ్ ఆర్టిస్ట్ కు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.

ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పబ్ లో ఉన్న వారందరినీ పోలీసులు అదుపులోకి కౌన్సిలింగ్ ఇచ్చారు.

అందులో మెగా డాటర్ నిహారిక కొణిదెల మరియు బిగ్ బాస్ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వంటి సినీ ప్రముఖులు ఉండటంతో అందరి దృష్టి ఈ కేసుపై మళ్లింది. రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అవడంతో వివాదంగా మారింది.

పబ్ వ్యవహారంలో పట్టుబడ్డ ప్రముఖుల పిల్లలు ఎక్కడ తమ ఐడెంటిటీ బయటపడుతోందని భయపడ్డారు. చాలా మంది ఈ ఘటనపై పెదవి విప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే యూట్యూబర్ కుశిత కల్లపు మాత్రం ఈ ఘటనపై ఓపెన్ గా మాట్లాడింది.

ఏ తప్పూ చేయకపోయినా మీడియా - సోషల్ మీడియాలలో తమ పేర్లు బయటకు రావడంతో ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ కుషిత ఓ వీడియోను నెట్టింట షేర్ చేసింది. తమను కించపరిచేలా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాను కోరింది.

ఈ క్రమంలో అన్ని మీడియా ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చింది. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకోలేదని.. చీజ్ బజ్జీలు తినడానికి మాత్రమే పబ్ కి వెళ్లానని చెప్పింది. చీజ్ బజ్జీల కోసమే రెగ్యులర్ గా పబ్ కి వెళ్తానని కుషిత చెప్పడం వైరల్ అయింది.

ఈ పబ్ వ్యవహారమంతా పరోక్షంగా కుషితకు సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చిపెట్టింది. బజ్జీల పాపగా పాపులర్ అయ్యింది. షార్ట్ ఫిల్మ్స్ చేసినా రాని గుర్తింపు.. ఈ ఇన్సిడెంట్ తో ఒక్కసారిగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె రీల్స్ అందరి దృష్టిని ఆకర్షించింది.

రోజురోజుకూ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ ఒక సెలబ్రిటీగా మారిపోయింది కుషిత. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. యంగ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అవి కూడా ప్రధాన పాత్రలే అని అంటున్నారు.

ఈ క్రమంలో కుషిత ఇప్పుడు ఒక ప్రముఖ యువ హీరో సినిమాకి సైన్ చేసిందని.. అందులో ఆమెనే మెయిన్ హీరోయిన్ గా కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే పబ్ వ్యవహారం కుషిత కు చాలానే హెల్ప్ చేసిందని చెప్పాలి. ఒక్క ఇన్సిడెంట్ మన లైఫ్ నే మార్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణగా చెప్పొచ్చు.