Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అక్క‌తో పోటీప‌డుతున్న‌ శ్రీ‌దేవి రెండో కూతురు

By:  Tupaki Desk   |   15 April 2021 8:30 AM GMT
ఫోటో స్టోరి: అక్క‌తో పోటీప‌డుతున్న‌ శ్రీ‌దేవి రెండో కూతురు
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మొదటి కుమార్తె జాన్వీ క‌పూర్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. జాన్వీ ధ‌డ‌క్ చిత్రంతో స‌క్సెస‌య్యాక కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. బాలీవుడ్ లో మేటి క‌థానాయిక‌గా దూసుకుపోతోంది. తొంద‌ర్లోనే శ్రీ‌దేవి- బోనీల రెండో గారాల‌ప‌ట్టీ జాన్వీ సోద‌రి ఖుషీ కూడా క‌థానాయిక‌గా రేస్ లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆ క్ర‌మంలోనే ఖుషీ క‌పూర్ ఇప్ప‌టికే అమెరికాలో న‌ట‌శిక్ష‌ణ తీసుకుంటోంది. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టే ఖుషీ కూడా అక్క బాట‌లోనే పయ‌నిస్తోంది. జాన్వీ డెబ్యూ సినిమా చేసే ముందు వేడెక్కించే ఫోటోషూట్ల‌తో చెల‌రేగింది. డెబ్యూ మూవీ రిలీజ్ స‌మ‌యంలో రిలీజ‌య్యాక‌.. ఆ త‌ర్వాతా జాన్వీ ప్ర‌కంప‌నాలు తెలిసిన‌దే. ఇప్పుడు త‌న సోద‌రిలానే ఖుషీ కూడా సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ అమ్మ‌డు వ‌రుస ఎక్స్ పోజింగ్ ఫోటోషూట్లు వెబ్ లో సునామీలా పోటెత్త‌నున్నాయ‌ని సంకేతం అందింది.

ఇప్ప‌టికే ఖుషీ తన అందమైన ఫోటోల‌తో ఇంటర్నెట్ లో వేడి పెంచేస్తోంది. ఖుషీ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఇన్ స్టా వేదిక‌గా తాజా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్నారు. అవ‌న్నీ క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. తాజా పోస్ట్ లో ఆకాశహర్మ్యాల సరిహద్దులో ఉన్న NYC సెంట్రల్ పార్క్ ప‌రిస‌రాల్లో స‌మ్మ‌ర్ సెల‌బ్రేష‌న్స్ గురించి ఖుషీ ఓపెన‌య్యారు. హలో సమ్మర్‌! అంటూ ఖుషీ తన ఆల్బమ్ కు క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో ఒక అంద‌మైన సెల్ఫీ వేడెక్కిస్తోంది.

పసుపు టాప్ చినుగుల‌ డెనిమ్స్ లో ఖుషీ సంథింగ్ హాట్ గా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జాన్వీ క‌పూర్ మాల్దీవుల విహార యాత్ర నుంచి మెంట‌లెక్కించే ఫోటోల‌ను షేర్ చేయ‌గా త‌న సోద‌రితో పోటీప‌డుతూ ఖుషీ కూడా బ‌రిలో దిగింద‌న్న‌మాట‌.. అంటూ అభిమానుల‌లో దీనిపై చ‌ర్చ సాగుతోంది.