Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్స్ తో ఖుషీ.. జాన్వీ కంటే డేంజ‌ర్!

By:  Tupaki Desk   |   19 July 2021 4:33 PM GMT
కిల్ల‌ర్ లుక్స్ తో ఖుషీ.. జాన్వీ కంటే డేంజ‌ర్!
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో బిజీ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె కెరీర్ ధేధీప్య మానంగా వెలిగిపోతోంది. క‌ర‌ణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక జాన్వీ వ‌రుస ఫోటోషూట్లు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే.

న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ వ‌ర్కౌట్ స్టిల్స్... యోగా సెష‌న్స్ స‌హా ఇత‌ర‌ ప‌ర్స‌న‌ల్ ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. అయితే ఇవ‌న్నీ జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అభిమానుల కోసం స్పెష‌ల్ ట్రీట్ గా ప్రారంభించింది. న‌టి కాక‌ముందు చాలా అరుదుగా మాత్ర‌మే త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకునేది. ఇదంతా క‌ర‌ణ్ జోహార్ మార్గ‌నిర్ధేశ‌నంలో జ‌రుగుతున్న ఒక ప్ర‌మోష‌న్ అని చెప్పాలి.

కానీ జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ మాత్రం హీరోయిన్ కాక‌ముందే హాట్ హాట్ ఫోజుల‌తో సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇలాంటి దుమారం ఖుషీ కి కొత్తేంకాదు. గ‌తంలో ప‌లుమార్లు ఖుషీ క‌పూర్ త‌న ప్ర‌యివేట్ లైఫ్ కి సంబంధించిన హాట్ హాట్ ఫోటోల‌తో స్పెష‌ల్ ఫోటోషూట్ల‌తో ఊపేసింది. సోష‌ల్ మీడియాలో క్రేజీ భామ‌గా పాపుల‌రైన‌ ఖుషీ మ‌రోసారి స్ట‌న్నింగ్ లుక్ తో ఆక‌ట్టుకుంది. క్రీమ్ క‌ల‌ర్ ఫ్యాంట్ ష‌ర్టు ధ‌రించిన అమ్మ‌డు టాప్ లో.. ష‌ర్టు విప్పేసి ఇన్న‌ర్ వేర్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమెరాల‌కు ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఖుషీ హీరోయిన్ కాక ముందే సోష‌ల్ మీడియాలో క్రేజీగా భామ‌గా వెలిగిపోతుంది. ఇక న‌టిగా స‌క్సెస్ అయితే ఖుషీ వేగాన్ని ఆపేదెవ‌రు? మ‌రి ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు కూడా వేగంగా జ‌రుగుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. జాన్వీ న‌టిగా స‌క్సెస్ ట్రాక్ ఎక్కేసింది. ఖుషీ కూడా ఎంట్రీ ఇచ్చి బండి ప‌ట్టాలెక్కించ‌డ‌మే ఆల‌స్యం. ఇక బోనీక‌పూర్ ఇంత‌కుముందు ఖుషీ క‌పూర్ సినీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే ఖుషీ ఎంట్రీ ఉంటుంద‌ని హింట్ ఇచ్చారు. అయితే ఖుషీ బాలీవుడ్ లో ప్ర‌వేశిస్తుందా..? లేక‌పోతే నేరుగా టాలీవుడ్ లోకే ఎంట్రీ ఇస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది. మ‌రోవైపు జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే మ‌హేష్ సినిమాతో టాలీవుడ్ లో ప్ర‌వేశించ‌నుంద‌న్న క‌థ‌నాలు జోరుగా వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిన‌దే.