Begin typing your search above and press return to search.

జాన్వీ సంగ‌తేమో కానీ సిస‌లైన‌ శ్రీ‌దేవి ఇదిగో

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:30 PM GMT
జాన్వీ సంగ‌తేమో కానీ సిస‌లైన‌ శ్రీ‌దేవి ఇదిగో
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణానంత‌రం `మామ్` లెగ‌సీని ముందుకు న‌డిపించేది ఎవ‌రు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. శ్రీ‌దేవి కుమార్తెలు జాన్వీ క‌పూర్.. ఖుషీ క‌పూర్ ఇద్ద‌రిలో ఎవ‌రు సిస‌లైన వార‌సురాలు? అన్న చ‌ర్చా వేడెక్కించింది.

అనంత‌రం కాలంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ ధ‌డ‌క్ చిత్రంతో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. న‌టిగా త‌న‌దైన ప్ర‌తిభ‌తో ఈ బ్యూటీ రాణిస్తోంది. ఇటీవ‌ల ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల్ని అందుకుంది. జాన్వీ త‌ర్వాత‌ ఇప్పుడు చిన్న కుమార్తె కుషి కపూర్ కూడా సినీరంగ ప్రవేశం వైపు అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అమెరికా న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో న‌ట‌శిక్ష‌ణ పొందిన ఖుషీ ప్ర‌స్తుతం బాలీవుడ్ ఆరంగేట్రం కోసం వేచి చూస్తోంది.

ఆ క్ర‌మంలోనే మైండ్ బ్లాక్ చేసే ఫోటోలు సెల్ఫీల‌తో ఇన్ స్టా వేదిక‌గా వేడెక్కిస్తోంది. ఖుషీ మునుప‌టితో పోలిస్తే హాట్ హాట్ గా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే అగ్గి రాజేసే బికినీ ఫోటోని షేర్ చేసి వెబ్ లో గుబులు పుట్టించింది. తాజాగా నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే ఫోటోషూట్ తో మ‌రోసారి కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపింది. ప్ర‌స్తుతం ఖుషీ క‌పూర్ రెడ్ హాట్ స్విమ్ సూట్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. బోల్డ్ రెడ్ లిప్ స్టిక్ పచ్చబొట్లతో మ‌తులు చెడ‌గొట్టింది. చూస్తుంటే జాన్వీ క‌పూర్ కంటే ఖుషీ లో హాట్ కంటెంట్ మ‌రింత‌గా రెచ్చ‌గొట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది! అంటూ కాంప్లిమెంట్లు అందుతున్నాయి.

అన్న‌ట్టు ఖుషీ తొలిగా బాలీవుడ్ లో న‌టిస్తుందా.. లేక సౌత్ లో ఆఫ‌ర్ అందుకుంటుందా? అన్న‌ది పాపా బోనీ క‌పూర్ వెల్ల‌డించాల్సి ఉంటుంది. జాన్వీ సంగ‌తేమో కానీ సిస‌లైన‌ శ్రీ‌దేవి ఇదిగో అంటూ రెడ్ స్విమ్ సూట్ ఫోటోల‌ను అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు.