Begin typing your search above and press return to search.

నటిగా నిరూపించుకోవాలి అంటున్న ఖుషీ...!

By:  Tupaki Desk   |   7 July 2020 11:00 PM IST
నటిగా నిరూపించుకోవాలి అంటున్న ఖుషీ...!
X
బాలీవుడ్ లో నెపోటిజం పై ఎంతగా డిస్కషన్స్ జరుగుతున్నా నటవారసుల ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. ఇప్పటి వరకు రణబీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, సోనాక్షీ సిన్హా, సోనమ్ కపూర్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ ఇలా చాలా మందే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో అలనాటి నటి దివంగత శ్రీదేవి - బోనీ కపూర్‌ ల చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హీరోయిన్ గా పరిచయం అవబోతోంది. ఇప్పటికే అక్క జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన హవా కనబరుస్తోంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్న ఖుషీ కపూర్‌ గతేడాది న్యూయార్క్ లో న్యూయర్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో మూవీకి సంబంధించిన కోర్సు కూడా కంప్లీట్ చేసింది. కాగా ఖుషీ తన స్కూల్‌ అకాడమీ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో తనకు సినిమాలపై ఉన్న ఆసక్తిని తెలియజేసింది ఖుషీ.

ఖుషీ కపూర్ మాట్లాడుతూ.. ''ఫిల్మ్‌ స్కూల్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ బిజినెస్‌ రంగంలో ఉంది. నా కుటుంబంతో కలిసి పనిచేసేందుకు నేనెప్పుడూ ఇష్టపడతాను. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నటిగా నిరూపించుకోవాలి అనుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. కాగా శ్రీదేవి తన చిన్న కూతురు మోడల్ అవ్వాలని కోరుకుందట. కాకపోతే ఇప్పుడు ఖుషీ మాత్రం బాలీవుడ్ లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నది. మరి ఖుషీ కపూర్ బాలీవుడ్‌ లో హీరోయిన్ గా రాణించగలుగుతుందో లేదో చూడాలి.