Begin typing your search above and press return to search.
ఖుషి.. నా రోజా నువ్వే..!
By: Tupaki Desk | 4 May 2023 5:24 PMవిజయ్ దేవరకొండ, సమంత జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమా పోస్టర్స్ సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. నా రోజా నువ్వే అంటూ రాబోతున్న ఈ సాంగ్ మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. విజయ్, సమంతల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ గా ఇది రాబోతుంది. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మలయాళంలో హృదయం సినిమాకు సూపర్ మ్యూజిక్ అందించారు అబ్దుల్ వహాబ్. హృదయం సినిమా సక్సెస్ లో సంగీతం ప్రధానంగా మారింది. అందులోని ప్రతి సాంగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. సంగీతానికి భాషతో అవసరం లేదు అన్నట్టుగా హృదయం తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోయినా సరే ఆ సినిమాలోని సాంగ్స్ మన ఆడియన్స్ కి నచ్చేశాయి. ఇప్పుడు ఖుషి సినిమాతో డైరెక్ట్ గా తెలుగు సాంగ్స్ ఇస్తున్నాడు అబ్ధుల్ వాహబ్.
విజయ్, సమంత ఇద్దరు సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి చేస్తున్న ఈ లవ్ స్టోరీ సినిమాపై బజ్ విపరీతంగా ఉంది. మహానటిలో ఈ ఇద్దరు కలిసి నటించగా ఉన్న కొన్ని సీన్స్ అయినా అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు ఖుషిలో ఫుల్ లెంగ్త్ సినిమాలో వీరు అలరించనున్నారు. వరుస ఫ్లాపులతో విజయ్.. శాకుంతలం షాక్ లో సమంత ఇద్దరు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఖుషి సినిమా ఈ ఇద్దరికి హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమా పోస్టర్స్ అయితే క్రేజీగా అనిపిస్తున్నాయి. తప్పకుండా ఈ జోడీ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. టక్ జగదీష్ తో నిరాశపరచిన డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఖుషితో మరోసారి తనేంటన్నది ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఖుషి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సాంగ్ పోస్టర్ తో ఆ విషయాన్ని డిక్లేర్ చేశారు.
విజయ్, సమంత ఇద్దరు తమ చివరి సినిమాలతో కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు. అయితే అవి ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. విజయ్ లైగర్, సమంత శాకుంతలం రెండు నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. మరి ఖుషి అయిన వారికి సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.