Begin typing your search above and press return to search.

తెలుగులో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళ స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   12 Aug 2021 2:08 PM GMT
తెలుగులో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళ స్టార్ హీరో..!
X
మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు, స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌.. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా దగ్గరయ్యాడు. 'ఓకే బంగారం' చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న దుల్క‌ర్.. 'మహానటి' సినిమాతో స్ట్రెయిట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. గతేడాది 'కనులు కనులను దోచాయంటే' చిత్రంతో ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ''కురుప్'' అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే యూట్యూబ్‌ లో రెండు మిలియన్ల వ్యూస్‌ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ క్రమంలో ఇది తెలుగులో అత్యధిక వ్యూస్ రాబట్టిన ఫస్ట్ మలయాళ మూవీ టీజర్ గా రికార్డ్ నమోదు చేసింది. తెలుగు ప్రేక్షకుల్లో దుల్కర్ కు ఉన్న పాపులారిటీని ఈ రికార్డ్ నిరూపిస్తోంది.

1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన భయంకరమైన క్రిమినల్‌ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుషీన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నిమిస్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

'కురూప్' చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. సన్నీ వేన్ - ఇంద్రజిత్ సుకుమారన్ - మనోజ్ బాజ్‌ పాయి కీలక పాత్రలో కనిపించనున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.