Begin typing your search above and press return to search.

'కురుప్' టీజర్: ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కథ..!

By:  Tupaki Desk   |   26 March 2021 3:46 PM GMT
కురుప్ టీజర్: ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కథ..!
X
మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌.. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలకరించాడు. ఈ క్రమంలో 'మహానటి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 'కనులు కనులను దోచాయంటే' చిత్రంతో సక్సెస్ అందుకున్న దుల్కర్.. ఇప్పుడు ''కురుప్'' అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దుల్క‌ర్ స‌ల్మాన్‌ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా 'కురుప్' తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'36 సంవత్సరాలు.. మూడు వందలకు పైగా టిఫాప్స్.. వెయ్యికి పైగా ప్రయాణాలు.. ఇదంతా ఒకరి కోసం..' అంటూ వచ్చిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన భారతదేశంలోనే ఎక్కువ కాలం వెతకబడిన సుకుమార కురుప్‌ అనే క్రిమినల్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ కు సుషీన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం.. సినిమాటోగ్రాఫర్ నిమిస్ రవి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సుకుమార కురుప్‌ పాత్రలో నటిస్తున్న దుల్కర్‌.. ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇందులో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ''కురుప్'' సినిమా విడుదల కానుంది.