Begin typing your search above and press return to search.

మిల్కీతో కోహ్లీ తెలుగు సినిమా

By:  Tupaki Desk   |   30 April 2017 4:29 AM GMT
మిల్కీతో కోహ్లీ తెలుగు సినిమా
X
బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ 2002 నుంచి సినిమాలు చేస్తున్నాడు. గత 15 ఏళ్లలో ఈయన దర్శకత్వంలో వచ్చినవి అరడజన్ సినిమాలు మాత్రమే అయినా.. వీటిలో కొన్ని భారీ సక్సెస్ లు అయతే.. విమర్శకుల ప్రశంసలు మాత్రం అన్నిటికీ దక్కడం విశేషం. ఇప్పుడీ డైరెక్టర్.. కొత్త మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే.. తన కొత్త చిత్రాన్ని తెలుగులో తీయాలని కునాల్ కోహ్లీ భావిస్తుండడం కొంత ఆశ్చర్యకరమైన విషయమే. అయితే.. ఈ మాట వాస్తవమే. డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు కునాల్ కోహ్లీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీలో లీడ్ హీరోయిన్ పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడట డైరెక్టర్. ఇప్పటికే తమ్మూను సంప్రదించడం.. తన కేరక్టర్ మలిచిన తీరు ఆకర్షణీయంగా ఉండడంతో.. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగినట్లు తెలుస్తోంది. తమన్నా అంగీకారం తెలపడంతో.. ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడట దర్శకుడు కునాల్ కోహ్లీ.

ఏ జోనర్ లో ఈ మూవీ ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. 'ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉండే ఈ స్టోరీలో తమన్నాదే కీలక పాత్ర. మిగిలిన తారాగణం కూడా పాత్రకు తగిన విధంగా ఉండేవారిని ఎంపిక చేసుకునేందుకు' చూస్తున్నారని తెలుస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ గా ఉండే ఈ చిత్ర షూటింగ్.. జూన్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/