Begin typing your search above and press return to search.

ఈ హిందీ హీరోకు 'శివ' అంటే పిచ్చ ఇష్టమట

By:  Tupaki Desk   |   24 Sep 2018 7:37 AM GMT
ఈ హిందీ హీరోకు శివ అంటే పిచ్చ ఇష్టమట
X
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యయంను క్రియేట్‌ చేసుకున్న చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ చిత్రం ఒక ట్రెండ్‌ ను సెట్‌ చేసింది. వర్మకు అది మొదటి సినిమానే అయినా కూడా అద్బుతంగా తీశాడు. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాలీవుడ్‌ హీరో కునాల్‌ కపూర్‌ ‘శివ’ చిత్రంపై తన ఇష్టంను - అభిమానంను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తాను స్కూల్‌ డేస్‌ లో ఉన్న సమయంలో శివ సినిమాను వారంలో కనీసం ఒక్కసారైనా చూసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

శివ చిత్రంతో నాగార్జున గారి అభిమానిని అయ్యాను, అలాంటి వ్యక్తి చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషాన్ని కలుగజేస్తోంది అంటూ కునాల్‌ కపూర్‌ అన్నాడు. తాజాగా ఈయన ‘దేవదాస్‌’ చిత్రంలో విలన్‌ గా నటించాడు. ఒక వైపు హిందీలో హీరోగా - క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ తెలుగులో విలన్‌ పాత్రలను చేసేందుకు ముందుకు వచ్చిన కునాల్‌ కపూర్‌ తనకు ఈ చిత్రం(దేవదాస్‌) మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని - తెలుగులో మంచి గుర్తింపును కూడా తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

‘దేవదాస్‌’ చిత్రం ప్రమోషన్స్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కునాల్‌ కపూర్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు. నాగార్జున గారు మరియు నాని గారు మంచి నటులు మాత్రమే కాకుండా మంచి మనుషులు కూడా. వారు సెట్స్‌ లో ఉంటే అంతా సరదాగా సాగిపోయేది. ఈ చిత్రంలోని తన పాత్రను చెప్పిన సమయంలో నో చెప్పలేక పోయాను. అంతగా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానన్నాడు. పలువురు బాలీవుడ్‌ నటులు టాలీవుడ్‌ ప్రేక్షకులకు విలన్స్‌గా పరిచయం అవుతున్నారు. మరి కునాల్‌ కపూర్‌ ఏమేరకు సక్సెస్‌ ను దక్కించుకుంటాడో చూడాలి.