Begin typing your search above and press return to search.

కన్నడకు వెళ్తున్న కుమారి!!

By:  Tupaki Desk   |   18 April 2016 9:13 AM GMT
కన్నడకు వెళ్తున్న కుమారి!!
X
టాలీవుడ్ లో కుమారి 21ఎఫ్ ఎన్ని సంచలనాలు సృష్టిందో చూశాం. బడ్జెట్ పరంగా చూసుకుంటే గతేడాది బ్లాక్ బస్టర్స్ లో టాప్ ఛార్ట్స్ లో ఉంటుంది ఈ మూవీ. పెట్టుబడికి కొన్ని రెట్ల మొత్తాన్ని వసూలు చేసింది ఈ సినిమా. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణం.. తనే రచయితగా వచ్చిన సినిమా కుమారి 21ఎఫ్. ఇప్పుడీ మూవీని కన్నడలో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

అక్కడ సెవెన్ ఛానల్ మనిక్కనం నారాయణన్ - శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ సంస్థలు ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్ గా పదేళ్లకు పైగా అనుభవం ఉన్న శ్రీమాన్ కన్నడ కుమారితో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి.. ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా.. స్టోరీ-స్క్రీన్ ప్లే క్రెడిట్స్ సుకుమార్ కి మాత్రమే ఉంటాయి. అక్కడ కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కంటిన్యూ కానుడడం విశేషం.

అయితే.. ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన నటీనటులను అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే హీరో హీరోయిన్లను ఎంపిక చేసేశారని మాత్రం తెలుస్తోంది. త్వరలో మిగిలిన వివరాలు ప్రకటించి మే నెల రెండో వారంలో ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే యోచనలో నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం కర్నాటకలో కూడా బోల్డ్ సినిమాలకు తెగ డిమాండ్ ఉంటోంది కాబట్టి.. మన బోల్డ్ కుమారి అక్కడ కూడా సూపర్ హిట్ సాధించే ఛాన్స్ ఉందని అంచనా.