Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌: కుమారి కిస్సెడుతోంది

By:  Tupaki Desk   |   13 Sep 2015 12:14 PM GMT
ఫస్ట్‌ లుక్‌: కుమారి కిస్సెడుతోంది
X
కాన్సెప్ట్స్ ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయడంలో ప్రత్యేకమైన ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్ సుకుమార్. కథ - స్క్రీన్ - మాటలు కూడా అందించి ''కుమారి 21 ఎఫ్‌'' ని తనే నిర్మిస్తున్నాడు సుకుమార్. లేటెస్ట్ గా సినిమా చూపిస్త మావా అంటూ మంచి హిట్ కొట్టేసిన రాజ్ తరుణ్ తో.. హీబా పటేల్ హీరోయిన్ గా నటించింది ఈ మూవీలో. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజయింది.

21ఏళ్ల అమ్మాయి ముచ్చట పడి.. ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకోవడమేకుమారి 21ఎఫ్ ఫస్ట్ లుక్. సింపుల్ గానే ఉన్నా... జంట భలేగా ఉందే అనిపిస్తోంది పోస్టర్ చూస్తుంటే. రాజ్ తరణ్ కూడా క్యూట్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ హీబా కూడా ముద్దెట్టడంలో మరీ లీనమైపోయినట్లుంది. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే ఎలాగూ మూవీకి అడ్వాంటేజ్. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మెస్మరైజింగ్ మ్యూజిక్ ఇవ్వడం ఖాయం. సూర్యప్రతాప్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే పోస్టర్ లో.. సుకుమార్ రైటింగ్స్ - సుకుమార్ ప్రజెంట్స్ అని, సుకుమార్ ఫోటో ఒకచోట వేయడం చూస్తుంటే మాత్రం.. కుమారి 21 ఎఫ్.. పూర్తిగా తన మూవీయే అని సుకుమార్ చెప్పకనే చెబ్తున్నాడనిపిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా అక్టోబర్‌ 30న రిలీజ్‌ చేసేద్దాం అని చూస్తున్నాడు సుకుమార్‌. ఒకవేళ దసరా సినిమాలన్నీ బ్లాక్‌ బస్టర్లు అయిపోతే మాత్రం అప్పుడు వాయిదా వేస్తాడట. త్వరలోనే ఎన్టీఆర్‌ లండన్‌ లో కుమారికి చెందిన ప్రమోషనల్‌ సాంగ్‌ ఒకటి రిలీజ్‌ చేయనున్నాడు.