Begin typing your search above and press return to search.

మురగదాస్ తుంటరి సలహాలు ఇచ్చాడట

By:  Tupaki Desk   |   22 Jan 2016 5:45 AM GMT
మురగదాస్ తుంటరి సలహాలు ఇచ్చాడట
X
గుండెల్లో గోదారి వంటి హిట్ సినిమాను తీసిన డైరెక్టర్ కుమార్ నాగేంద్ర. ఇతడు ప్రస్తుతం నారా రోహిత్ తో తుంటరి మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది. వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన కోలీవుడ్ మూవీకి రీమేక్.

రీమేక్ రైట్స్ కొనేందుకు చెన్నై వెళ్లినపుడు కుమార్ నాగేంద్రకు అనేక విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయట. ఇలాంటి సమయంలో గుండెల్లో గోదారి చిత్రాన్ని చూసిన ఓ నిర్మాత - కుమార్ గురించి మురగదాస్ కు చెప్పాడట. అపుడు మురుగదాస్ స్వయంగా కుమార్ కి కాల్ చేసి, కొన్ని సలహాలు ఇస్తాను రమ్మని పిలిచాడని చెబ్తున్నాడీ డైరెక్టర్. రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడంలో సహకరించడమే కాకుండా.. కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడట మురుగ.

తెలుగు వెర్షన్ కోసం కొన్ని కీలకమైన మార్పులను సూచించాడట మురగదాస్. వాటన్నిటినీ ఎంతో ఆనందంగా స్వీకరించిన కుమార్ నాగేంద్ర.. అంత పెద్ద దర్శకుడి నుంచి సలహాలు, స్వీకరించడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు. అంతే కాదు.. అలా చేసిన మార్పుల కారణంగానే ఈ తుంటరి మూవీ చాలా అద్భుతంగా వచ్చిందని చెబుతున్నాడు. మరోవైపు తన హీరో నారా రోహిత్ ను దర్శకుల హీరోగా చెబుతున్నాడు కుమార్ నాగేంద్ర. డైరెక్టర్ల పనిలో వేలు పెట్టకుండా, వారు చెప్పిన విషయాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతాడని, అలాంటి హీరోలు చాలా తక్కువమంది ఉంటారని కుమార్ నాగేంద్ర అంటున్నాడు.