Begin typing your search above and press return to search.

ఈ పాప పిల్లి కళ్లు.. లేత ఒళ్ళు చూస్తే సెగలే..!!

By:  Tupaki Desk   |   13 Jun 2020 9:30 AM GMT
ఈ పాప పిల్లి కళ్లు.. లేత ఒళ్ళు చూస్తే సెగలే..!!
X
కుబ్రా సైట్.. బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని బ్యూటీ. బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ 36యేళ్ళ సుందరి ఎక్కువగా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో కనిపించింది. బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ సైన్సెస్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయింది. అయితే పదమూడేళ్లకే కుబ్రా ఓ టీవీ షోకి యాంకర్ గా పనిచేసింది. ఇక ఈ మోడలింగ్.. సినిమా ఫీల్డ్ కి వచ్చేముందు మైక్రోసాఫ్ట్ లో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేసిందట. ఇక ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టి.. 2013లో ఇండియాస్ బెస్ట్ ఫిమేల్ ఎంసీ అవార్డు అందుకుంది.

కుబ్రా అంతకుముందే మిస్ ఇండియా వరల్డ్ వైడ్ బ్యూటీ పెజెంట్ అవార్డు-2009 సొంతం చేసుకుంది. ఇక 2011లో సల్మాన్ ఖాన్ 'రెడీ' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అడపాదడపా సినిమాలు చేసింది. సుల్తాన్, గల్లీబాయ్ సినిమాలలో మెరిసింది కానీ సరైన గుర్తింపు లభించలేదు. ఇక లాభం లేదని వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ వెళ్తుంది. అయితే 2018లో నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన 'సాక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్ కుబ్రాకి ఎంతో పేరు తీసుకొచ్చింది. అందుకు కారణం అందులో కుబ్రా చేసిన ట్రాన్స్ జెండర్ కుకూ పాత్ర. ఇక ఈ ఏడాది కుబ్రా జవానీ జానెమన్ అనే సినిమాలో చివరిగా కనిపించింది.

ఇక అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే అమ్మడు ఫోటోషూట్లలో మాత్రం అందాలను అవలీలగా ఆరబోస్తుంది. ఆ అందాలను కనులారా ఆస్వాదించేందుకు లక్షలలో అభిమానులు వెయిట్ చేస్తుంటారు. కుబ్రా ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఈ భామ స్విమ్మింగ్ పూల్ లో ఉంది. బ్లాక్ స్విమ్ సూట్ ధరించి అమ్మడు పెట్టిన పోజుకి కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో కుబ్రా.. తన ఎద సంపద మొత్తం కెమెరా ముందు నిలిపింది. ఈ పిల్లి కళ్ల పాప.. ఒళ్ళు నెటిజన్లలో సెగలు రేపుతున్నాయి అంటున్నారు చూపారులు. ఇక ప్రస్తుతం అమ్మడు 'డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే' సినిమాలో నటిస్తుంది.