Begin typing your search above and press return to search.

ఆ సినిమా కోసం కేటీఆర్ ట్వీట్

By:  Tupaki Desk   |   13 Feb 2017 10:09 PM IST
ఆ సినిమా కోసం కేటీఆర్ ట్వీట్
X
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. సినిమా రంగానికి కూడా చాలా దగ్గరగా ఉంటారనే విషయం తెలిసిందే. చాలా సార్లు సినిమా ఫంక్షన్లలో దర్శనం ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఓ మూవీని ప్రమోట్ చేసే బాధ్యతను కూడా తీసేసుకున్నారు. ఓ మంత్రిగా ఉండికూడా.. తన స్నేహితుడిని ప్రోత్సహించేందుకు గాను.. ఓ మూవీ ఫస్ట్ లుక్ ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు కేటీఆర్.

కాదలి అనే టైటిల్ పై రూపొందుతున్న సినిమాకు సంబంధించి మూడు రోజులుగా.. ఒక్కో అక్షరంతో ఒక్కో పోస్టర్ చొప్పున విడుదల చేసి ఆసక్తిని కలిగించిన మేకర్స్.. ఇప్పుడు కేటీఆర్ చేతుల మీదుగా పూర్తి ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. లవ్ స్టోరీ కావడంతో.. వేలంటైన్స్ డే స్పెషల్ గా కాదలి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. ఈ చిత్ర దర్శకుడు కేటీఆర్ కు చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. 'ప్రియమైన స్నేహితుడు చిన్నప్పటి నా క్లాస్ మేట్ అయిన పట్టాభి ఆర్ చిలుకూరి తొలిసారిగా దర్శకత్వం వహించిన మూవీ కాదలి. ఆ చిత్రం ఫస్ట్ లుక్' అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

ఇద్దరు కుర్రాళ్లు.. ఒక అమ్మాయి మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాగా.. 'మీ ప్రేమను ఎంచుకోండి.. మీ ఎంపికను ప్రేమించండి' అంటూ రాసిన క్యాప్షన్.. 'కొన్ని ఛాయిస్ లను ఎంచుకోవడం చాలా కష్టం' అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/