Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అడ్రస్ హైద్రాబాదే

By:  Tupaki Desk   |   7 Dec 2015 12:27 PM IST
టాలీవుడ్ అడ్రస్ హైద్రాబాదే
X
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక టాలీవుడ్ వైజాగ్ మీద కన్నేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్ లో అభివృద్ధి చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంది. అయితే.. టాలీవుడ్ ఇలా తరలి వెళ్లిపోకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనే విషయాన్ని.. సాక్షాత్తూ ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పడం విశేషం.

గత కొంత కాలంగా కేటీఆర్ సినిమా ఫంక్షన్లకు బాగానే అటెండ్ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో టచ్ లో ఉండడమే కాదు.. కొన్ని ప్రైవేట్ పార్టీలకు కూడా అటెండ్ అవుతున్నారు. చెర్రీకి చెందిన విమాన యాన సంస్థ ట్రూజెట్ ఫంక్షన్ కు కూడా హాజరయ్యి.. తమ రిలేషన్ ని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడో ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వ ఉద్దేశ్యమేంటో నేరుగానే పంచుకున్నారు కేటీఆర్. "టాలీవుడ్ వైజాగ్ కు షిఫ్ట్ అవకూడదన్నమే మా లక్ష్యం. హైద్రాబాద్ లో వారికి అన్ని వసతులు ఉన్నాయి. మా మద్దతు కూడా ఉంది. ఇది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పరిశ్రమ. దీనికి నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువే అయినా.. ఈ రంగంపై ఆధారపడి.. 30వేల మంది జీవిస్తున్నారు. మరింత విస్తృతంగా ఉపాధికి అవకాశం ఉంది."

"టాలీవుడ్ లో ఎక్కువమంది సూపర్ స్టార్స్ కోస్తాంధ్రకి చెందినవారే. సినిమాలంటే మన దేశంలో అందరికీ ఇష్టమే. ఎక్కడైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ అభివద్ధి చెందిన టాలీవుడ్.. ఇక్కడ నుంచి తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం" అంటూ తమ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని నేరుగానే పంచుకున్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.