Begin typing your search above and press return to search.
హీరోలను దాటిపోయిన కేటీఆర్ క్రేజ్
By: Tupaki Desk | 26 April 2016 11:00 PM ISTసాధారణంగా కుర్రకారులో సినిమా హీరోలకే క్రేజ్ ఉంటుంది. అందుకే.. మోస్ట్ డిజైరబుల్ మెన్ అని లిస్ట్ చేస్తే.. అందులో అందరూ సినిమా హీరోలే ఉంటారు. జనాలు కూడా సినిమావాళ్లకే ఓట్లేస్తారు. కానీ ఈ సారి లిస్ట్ లో ఆశ్చర్యకరంగా కేటీఆర్ పేరు చాలా అంటే చాలా ముందుకు వచ్చేసింది. మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 11 వ స్థానంలో నిలిచారు.
అంటే పొలిటికల్ గా ఓ ఐకాన్ అయిపోయిన కేటీఆర్ కి.. ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఈ ర్యాంక్ ని చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే. చైతు - అఖిల్ - శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో పోల్చినా.. కేటీఆర్ అల్లంత ఎత్తులో ఉన్నారు. నిజానికి స్టార్టప్ హబ్ లాంటి వాటితో ఈ తెలంగాణ ఐటీ మంత్రి బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను ఒంటిచేత్తో గెలిపించుకున్న తర్వాత.. కేటీఆర్ స్థాయి బాగా పెరిగిపోయింది.
ప్రజలకు ఎక్కువగా చేరువలో ఉండే తత్వం ఆయన్ను జనాలకు బాగా దగ్గర చేసింది. అందుకే బోలెడంత మంది కుర్రాళ్లను దాటి డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 11 వ ర్యాంక్ తెచ్చుకున్నారు. నితిన్, రామ్. రాజ్ తరుణ్ లాంటి చాలామంది కుర్ర హీరోలు ఈయన కంటే చాలా వెనకబడిపోయారు. ఇదే స్పీడ్ మరికొన్నాళ్లు కంటిన్యూ చేస్తే.. వచ్చే ఏడాది ఖచ్చితంగా టాప్ 10లో కేటీఆర్ పేరు కనిపించడం ఖాయమంటున్నారు.