Begin typing your search above and press return to search.

అబ్బా కెటిఆర్‌.. టచ్‌ చేశావయ్యా!!!

By:  Tupaki Desk   |   29 Jun 2015 1:12 PM IST
అబ్బా కెటిఆర్‌.. టచ్‌ చేశావయ్యా!!!
X
తెలంగాణ ఐటి మినిష్టర్‌ అక్కడ.. కాని కష్టాల్లో ఉంది గుంటూరు నుండి వచ్చిన ఒక పేద రైతు. అప్పట్లో ఈ నాగయ్య ''వేదం'' సినిమాలో సిరిసిల్లకు చెందిన ఓ రైతు రాములుగా సినిమాలో మెరిశాడు. ఆ తరువాత సినిమాలు పెద్దగా రాలేదు. నిజానికి సినిమా ఆఫర్లు రావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేక ఫిలిం నగర్‌ వీధులపై ఈయన అడుక్కుంటున్నారని ఈ మధ్యనే మనం తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని కొందరు చాలామంది పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

తనకు ట్విట్టర్‌లో విషయం చెప్పిన వెంటనే చటుక్కని స్పందించారు తెలంగా ఐటి మినిష్టర్‌, సిఎం కెసిఆర్‌ తనయుడు కెటిఆర్‌. వెంటనే ఆయన నాగయ్య కాంటాక్ట్‌ డిటైల్స్‌ తెలుసుకొని, ఆయన్న తన ఆఫీస్‌కు పిలిపించి ఓ లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు. అంతేకాదు, గవర్నమెంటు తరుపున ఫించను కూడా ఏర్పాటు చేయించారు. ఇక తెలుగు సినిమా ఆర్టిస్టుల సంఘంలో అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి వెంటనే నాగయ్య ఏదైనా సాయం అందించాలని కూడా కోరారు. ఒక్క చిన్న పనితో కెటిఆర్‌ నిజంగానే తెలుగు సినిమా అభిమానుల హృదయాలను కొల్లగొట్టేశారు. టచ్‌ చేశావయ్యా తారక రాముడా!!!