Begin typing your search above and press return to search.
మనోజ్ పాటకి కేటీఆర్ ఫిదా!
By: Tupaki Desk | 20 April 2020 2:00 PM ISTకరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీల సాయం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. వైరస్ పై అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రొగామ్ లు చేస్తూ... స్టే హోమ్...స్టే సేఫ్!! అని సూచిస్తూ.. విలువైన తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న ప్రతి తీ స్టార్ తాజా సన్నివేశంపై స్పందించారు. చిన్న.. పెద్ద అనే తారతమ్యం లేకుండా హీరోలంతా స్పందించి తమకు తోచిన సహాయం అందించడంతో పాటు జాగ్రత్తలు సూచించారు. ఇక టీవీ ఆర్టిస్టులు కూడా అవేర్ సెస్ ప్రోగ్రామ్స్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. తమకు తోచిన విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టీవీల్లో కనిపిస్తూ వైరస్ గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు.
తాజాగా మంచు మనోజ్ వీళ్లందరికీ భిన్నంగా ఓ పాట రూపంలో అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. ముందుగా జాతీయ జెండాను చూపిస్తూ..అటుపై ప్రధాని మోదీ సూచనలు చెబుతోన్న వీడియోలను..అటుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనల వీడియో క్లిప్స్ ని ఈ వీడియోలో చూపించాడు. అటుపై స్లో మోషన్ బీట్ తో `గుండె చెదిరిపోకురా..గూడు వదలబాకురా..ధైర్యం వీడబాకురా..అంతా బాగుంటాం రా.. బాగుంటారా...సల్లగుంటామురా..చక్కగుంటామురా..చీకటి ఉండిపోదురా..మల్లా వెలుగొస్తాదిరా`` అంటూ చైతన్యం తీసుకొచ్చే పాటను స్వయంగా మనోజ్ ఆలపించడం హైలైట్ అయ్యింది. పాట ట్యూన్...సాహిత్యం...మనోజ్ వాయిస్ చక్కగా కుదిరాయి.
ఇప్పటివరకూ చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటివి చేసారు. కానీ మనోజ్ వాళ్లందరికంటే కాస్త భిన్నంగా ట్రై చేసి ప్రశంలందుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అయితే ఫిదా అయిపోయారు. ``ఈ చీకటి ఇలాగే ఉండిపోదని.. మరలా వెలుగు వస్తుందని.. గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం ఇది`` అంటూ మనోజ్ ని ప్రశంసించారు. మా హృదయాలను నీ పాట దోచుకుందంటూ మనోజ్ ని కొనియాడారు. కేటీఆర్ ట్వీట్ కు మనోజ్ సంతోషంగా థాంక్స్ చెబుతూ బదులిచ్చాడు. తన పాట అందరికీ చేరువవు తుందని..అంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ లో ఓ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.