Begin typing your search above and press return to search.

వావ్.. ఆ ట్రైలర్ కు 3 లక్షల హిట్స్

By:  Tupaki Desk   |   16 Feb 2016 10:30 PM GMT
వావ్.. ఆ ట్రైలర్ కు 3 లక్షల హిట్స్
X
స్టార్ హీరోల సినిమాల టీజర్లు - ట్రైలర్లు విడుదలయ్యాయంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఒకటే హంగామా ఉంటుంది. టీజర్ - ట్రైలర్ ఎలా ఉన్నా సరే.. అవి అక్కడ పెద్ద హిట్టయిపోతాయి. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లోకి వచ్చాయంటే 10 లక్షల వ్యూస్ అన్నది ఈ రోజుల్లో చాలా మామూలైపోయింది. ఐతే ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా.. కేవలం కంటెంట్ తో జనాల్ని ఆకర్షించి మంచి వ్యూస్ సంపాదించుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ‘క్షణం’ ఆ కోవలోని సినిమానే అని చెప్పాలి. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ జనాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తించింది.

హాలీవుడ్ థ్రిల్లర్స్ తరహాలో ట్రైలర్ ఓ రేంజిలో ఉండటంతో జనాలు చాలా ఆసక్తిగా ట్రైలర్ చూశారు. ఫీడ్ బ్యాక్ చాలా బాగుండటంతో మౌత్ టాక్ తోనే మరింతమంది ట్రైలర్ చూశారు. ఇలా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ట్రైలర్ 3 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని సినిమా ట్రైలర్ కు ఇన్ని హిట్స్ రావడం అన్నది మామూలు విషయం కాదు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ ట్రైలర్ సూపర్బ్ అంటూ ప్రశంసలు కురిపించడం విశేషం. ట్రైలర్ తర్వాత విడుదల చేసిన ‘క్షణం’ థీమ్ మ్యూజిక్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది.