Begin typing your search above and press return to search.

ఆ `క్ష‌ణం` వారం ముందే వ‌స్తుందా?!

By:  Tupaki Desk   |   16 Feb 2016 5:54 AM GMT
ఆ `క్ష‌ణం` వారం ముందే వ‌స్తుందా?!
X
సంక్రాంతి సినిమాలు రెండు మూడు వారాలు తీసేసుకొన్నాయి. దీంతో త‌ర్వాత వ‌చ్చే శుక్ర‌వారాల‌పై ఆ ఎఫెక్ట్ ప‌డింది. అందుకే ఒక్కొక్క వారం మూడు నాలుగు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. మార్చి 4నే నాలుగైదు సినిమాలు వ‌చ్చేలా ఉన్నాయి. ఇప్ప‌టికే మూడు సినిమాలు ఆ తేదీని ఖ‌రారు చేసుకొన్నాయి. అందులో `క్ష‌ణం` కూడా ఒక‌టి. అయితే ఒకేవారం అన్నేసి సినిమాలు విడుద‌లైతే దేనికీ ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రావు. అందుకే క్ష‌ణంని ఒక వారం ముందే విడుద‌ల చేయాల‌ని ఆ చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొన్న‌ట్టు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 19న కృష్ణాష్ట‌మితో పాటు మీకు మీరే మాకు మేమే - మ‌లుపు చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఆ త‌ర్వాత వ‌చ్చే శుక్ర‌వారం కాస్త ఖాళీగా క‌నిపిస్తోంది. అందుకే మ‌ధ్యే మార్గంగా ఫిబ్ర‌వ‌రి 24న క్ష‌ణంని విడుద‌ల చేయాల‌ని పీవీపీ సంస్థ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అడ‌వి శేష్ - ఆదాశ‌ర్మ‌ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం క్ష‌ణం. ఒక థ్రిల్లింగ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంపై మంచి అంచ‌నాలున్నాయి. ట్రైల‌ర్‌ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే ఆ సినిమా కోసం నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరి ప్ర‌త్యేకంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాడు. మంచి గ్యాప్ చూసుకొని సినిమాని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడాయ‌న‌. అడ‌విశేష్ స్వ‌యంగా రాసిన క‌థ‌తో క్ష‌ణం తెర‌కెక్కింది.