Begin typing your search above and press return to search.

రెండిటి మధ్యలో ముచ్చటగా మూడోది

By:  Tupaki Desk   |   26 Feb 2016 1:55 AM GMT
రెండిటి మధ్యలో ముచ్చటగా మూడోది
X
ఈ వారంతరం చిన్న సినిమాల సందడికి సిద్ధమవుతుంది. డైరెక్ట్ సినిమాలేకాక పలు డబ్బింగ్ చిత్రాలు కూడా తోడవ్వడంతో ప్రేక్షకుడికి మంచి ఛాయస్ దక్కుతుంది. దాదాపు ఎనిమిది సినిమాలు విడుదలవుతున్నా మెయిన్ ఫోకస్ మాత్రం 'క్షణం', 'పడేసావే' సినిమాలపైనే వుండడం గమనార్హం.

అడవి శేష్ - అనసూయ - అదా శర్మ ల క్షణం చిత్రం ట్రైలర్ నుండీ అందరినీ ఆకట్టుకుంది. ఇక నాగార్జున చేయూతతో పడేసావే సినిమా జోరుగా పబ్లిసిటీ చేసుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాల మధ్య మరో సినిమా పాజిటీవ్ ప్రీ రిలీజ్ టాక్ ని అందుకుంటుంది. అదే శ్రీకాంత్ నటించిన టెర్రర్ సినిమా. సతీష్ కాసెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిన్న ప్రిమియర్ షో రూపంలో పత్రికా వర్గాలకు, సినీ ప్రముఖులకు ప్రదర్శించారు. అందరినోటా పాజిటీవ్ టాక్ రావడంతో బరిలోకి శ్రీకాంత్ టెర్రర్ కూడా చేరింది. డబ్బింగ్ సినిమాగా విడుదలకానున్న యమపాశం చిత్రాన్ని కూడా నిన్న ప్రిమియర్ ప్రదర్శించడం విశేషం.