Begin typing your search above and press return to search.

ఫ్యాక్షన్ రూట్ లో బాలయ్య 101

By:  Tupaki Desk   |   18 Feb 2017 6:10 AM GMT
ఫ్యాక్షన్ రూట్ లో బాలయ్య 101
X
నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో.. తన కెరీర్ బెస్ట్ హిట్ సాధించారు. అంతే కాదు.. తొలిసారిగా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన బాలయ్య.. 101వ చిత్రం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉంటున్నారు. శాతకర్ణితో టాలీవుడ్ హీరోలు ఎవరూ చేయని ప్రయోగాన్ని చేసిన బాలకృష్ణ.. 101 విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ లో పడిపోయారు.

చారిత్రక.. జానపద.. ప్రయోగాత్మక.. ఇలా ఏ జోనర్ లో అయినా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న బాలయ్య.. వరుసగా ఎక్స్ పెరిమెంట్స్ అంటే మాత్రం ఆలోచిస్తున్నారట. అందుకే శాతకర్ణి తర్వాత ఓ పక్కా మాస్ మసాలా మూవీ చేసేందుకు సిద్ధమైన ఆయన.. ఇప్పుడు ఓ ఫ్యాక్షన్ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డల్ అయినా.. గతంలో రజినీకాంత్ - కమల్ హాసన్.. చిరంజీవిలతో సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో.. ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట బాలయ్య.

కంప్లీట్ గా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్ కోసం వేట ప్రారంభమైపోవడంతో.. కేఎస్ రవికుమార్-బాలయ్యల కాంబో కన్ఫా అయినట్లే అని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. లీడ్ హీరోయిన్ గా మరోసారి శ్రియ పేరు వినిపిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/