Begin typing your search above and press return to search.

చీప్ హోటల్ తో అప్సెట్ అయిన డైరెక్టర్??

By:  Tupaki Desk   |   1 Sep 2019 11:26 AM GMT
చీప్ హోటల్ తో అప్సెట్ అయిన డైరెక్టర్??
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'రూలర్'.. 'క్రాంతి' అనే పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకూ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ రీసెంట్ గా థాయ్ ల్యాండ్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో బాలయ్య.. హీరోయిన్ సోనాల్ లపై ఒక పాటను చిత్రీకరించారు.

అయితే ఈ థాయ్ ల్యాండ్ షెడ్యూల్ లో దర్శకుడు కెయస్ రవికుమార్ అప్సెట్ అయ్యారని ఒక లీడింగ్ ఇంగ్లీష్ డైలీలో కథనం వచ్చింది. #NBK105 టీమ్ మెంబర్స్ అందరికీ థాయ్ ల్యాండ్ లో ఒక హోటల్ బుక్ చేయడం జరిగిందట. అంటే లైట్ బాయ్ నుంచి బాలయ్య..కెయస్ రవికుమార్ వరకూ ఒకే రకమైన హోటల్ బుక్ చేశారట. ఈ విషయంపై కెయస్ రవికుమార్ అప్సెట్ అయ్యారట. షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన సరైన మూడ్ లో లేరట. మరి ఈ విషయంపై రవికుమార్ నిర్మాతకు సమాచారం ఇచ్చారో లేదో తెలియదు. ఒకవేళ అలా అందరికీ సేమ్ హోటల్ బుక్ చేయడంతో రవి కుమార్ అప్సెట్ అయ్యారంటే సీనియర్ స్టార్ అయిన బాలయ్య డైరెక్టర్ అప్సెట్ అయిన విషయాన్ని గమనించకుండా ఉంటారా? ఏదేమైనా ఇలాంటి విషయాల ప్రభావం సినిమా అవుట్ పుట్ పై పడకుండా ఉంటే అదే ఫ్యాన్స్ కు పెద్ద రిలీఫ్.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య న్యూ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ పాత్ర తరహాలో బాలయ్య గడ్డం స్టైలిష్ గా ఉంది. రీసెంట్ గా #NBK105 టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లలో బాలయ్య యంగ్ గా కనిపిస్తున్నారు. #NBK105 లో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.