Begin typing your search above and press return to search.

బాలయ్య ఒక రజినీకాంత్ - కె.ఎస్

By:  Tupaki Desk   |   14 Jan 2018 3:37 PM IST
బాలయ్య ఒక రజినీకాంత్ - కె.ఎస్
X
తమిళంలో సూపర్ రజినీకాంత్ ఎలాగో.. తెలుగులో నందమూరి బాలకృష్ణ అలాగే అంటున్నాడు సీనియర్ దర్శకుడు. బాలయ్యతో ‘జై సింహా’ సినిమా తీసిన రవికుమార్.. ఎన్నో కథల్ని పరిశీలించి చివరికి బాలయ్యకు తగ్గ మాస్ కథతో ‘జై సింహా’ రూపొందించినట్లు తెలిపారు. ఈ సినిమా రొటీన్ గా.. ఊర మాస్ గా ఉందన్న అభిప్రాయాలపై స్పందించారు.

ప్రతి నటుడికీ ఒక ఇమేజ్ ఉంటుందని.. దానికి తగ్గట్లే కథలు ఎంచుకోవాలని.. కమల్ హాసన్ లాంటి హీరో అయితే క్లాస్ కథతో సినిమా తీసేవాడినని.. కానీ బాలయ్య కమల్ కాదని.. రజినీకాంత్ అని అన్నాడు కె.ఎస్. రజినీ లాగే బాలయ్యకు మాస్ ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణ ఉందని.. అందుకే మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ‘జై సింహా’ కథను ఎంచుకున్నానని.. ఎవరి కోసమైతే ఈ సినిమా చేశామో ఆ వర్గం ప్రేక్షకులు సినిమా పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని రవికుమార్ అన్నాడు.

బాలయ్యతో తాను ఎప్పుడో సినిమా చేయాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని.. ఇంత కాలానికి తమ కాంబినేషన్ కుదరడం.. ‘జై సింహా’ లాంటి మంచి సినిమా రావడం సంతోషంగా ఉందని రవికుమార్ అన్నాడు. బాలయ్య-నయతార జోడీ ‘జై సింహా’కు ప్రత్యేక ఆకర్షణ అని.. వాళ్లిద్దరి ప్రేమకథ పరిణతితో సాగుతుందని.. ఇద్దరూ చాలా బాగా నటించారని రవికుమార్ అన్నాడు.