Begin typing your search above and press return to search.

సీనియర్ ప్రొడ్యూసర్ .. చాలా హోప్స్ ఉన్నాయ్

By:  Tupaki Desk   |   1 Jun 2018 6:04 AM GMT
సీనియర్ ప్రొడ్యూసర్ .. చాలా హోప్స్ ఉన్నాయ్
X
టాలీవుడ్ లో సీనియర్ నిర్మాణ సంస్థలు చాలా వరకు కనిపించకుండా పోతున్నాయి. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను నిర్మించిన నిర్మాతలు నష్టాల బాట పట్టి సినిమాలకు ఎండ్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొందరు మాత్రం నిలకడగా రాణిస్తూ సినిమా ప్రపంచంలో ఇంకా వారి గుర్తింపు ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో కె.ఎస్.రామారావు గారు ఒకరు. 35 ఏళ్ల నుంచి క్రియేటివ్ కమర్షియల్ మూవీస్ సంస్థను ఆయన సక్సెస్ ఫుల్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.

డబ్బింగ్ సినిమాలతో కలిపి 44 సినిమాల వరకు నిర్మించారు. ఇక ఇప్పుడు 45వ సినిమాగా తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా రానుంది. కరుణాకరన్ దర్శకత్వంలో రానున్న ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి నిర్మాత కె.ఎస్ రామరావు కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ 44 సినిమాలు నిర్మించాం. నా చివరి శ్వాస వరకు కూడా సినిమాలు నిర్మిస్తూనే ఉంటా. ముందుగా నేను ఒక సాధారణ ప్రేక్షకుడిని. ఆ విధంగా కథలను ఒకే చేసి నిర్మిస్తా.

కరుణాకరన్ దర్శకత్వంలో తమ బ్యానర్ పై ఇది రెండవ సినిమా. గతంలో ఆయనతో వాసు సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాం. ఇక ఇప్పుడు తేజ్ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది అని భావిస్తున్నా. ఎక్కడా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా. సెన్సార్ కట్ కి అవకాశం ఇవ్వకుండా ఒక ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా సినిమాను దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించారు. ఎంత పెద్ద హీరో అయినా కూడా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరుకునే వారు లేకపోలేదు అని తన నమ్మకం అని కె.ఎస్ రామారావు గారు తెలిపారు. ఇక జూన్ 29న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పిన నిర్మాత.. ఈ సినిమాపై ఏ రేంజు హోప్స్ పెట్టుకున్నారో ఈ మాటలు చూస్తే అర్ధమవుతోంది. మరి కరుణాకరన్ వాటిని అందుకుంటాడా? చూద్దాం.