Begin typing your search above and press return to search.

అవసరాలను ఎంచుకున్న క్రిష్‌

By:  Tupaki Desk   |   19 Oct 2019 6:04 AM GMT
అవసరాలను ఎంచుకున్న క్రిష్‌
X
దర్శకుడిగా క్రిష్‌ కెరీర్‌ ను ఆరంభించి చాలా ఏళ్లయ్యింది. సినిమా సంఖ్య పెంచుకోవడం కాకుండా మంచి సినిమాలు తీయాలని.. విలక్షణ సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో క్రిష్‌ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. విభిన్న చిత్రాలను తీస్తూ తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకున్న క్రిష్‌ బాలీవుడ్‌ లో కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మంచి కాన్సెప్ట్‌ లతో సినిమాలను నిర్మించేందుకు కూడా క్రిష్‌ ఆసక్తిగా ఉన్నాడు. స్నేహితుడు రాజీవ్‌ రెడ్డితో కలిసి క్రిష్‌ 'అంతరిక్షం' సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.

క్రిష్‌ నిర్మాణంలో మరో సినిమా నేడు ప్రారంభం కాబోతుంది. ఈసారి స్నేహితుడు రాజీవ్‌ రెడ్డితో పాటు దిల్‌ రాజుతో కలిసి సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. కథను బట్టి హీరోను ఎంపిక చేసుకునే క్రిష్‌ ఈసారి తన సినిమాకు అవసరాల శ్రీనివాస్‌ ను ఎంపిక చేసుకున్నాడు. ఈసారి కూడా కమర్షియల్‌ సినిమా కాకుండా ఒక విభిన్నమైన నేపథ్యంలో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కమెడియన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న అవసరాల శ్రీనివాస్‌ హీరోగా ఇప్పటికే పరిచయం అయ్యాడు. క్రిష్‌ మరోసారి అవసరాలను హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్నాడు.

క్రిష్‌ బ్యానర్‌ లో సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్‌ ఉంటుందని.. ఈ చిత్రంతో అవసరాల ఫుల్‌ టైం హీరోగా మారిపోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రిష్‌ నిర్మాతగా సినిమా మొదలు పెట్టబోతున్నాడు.. కాని దర్శకుడిగా మాత్రం ఈయన సినిమా చేయడం లేదు. 'ఎన్టీఆర్‌' చిత్రం తర్వాత క్రిష్‌ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. పలువురు స్టార్‌ హీరోలు ఈయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దంగా ఉన్నారు. కాని క్రిష్‌ మాత్రం బ్రేక్‌ తీసుకుంటున్నాడు ఎందుకో మరి..!