Begin typing your search above and press return to search.

#KRKR: వ‌ర్మ‌ పై కేఏ పాల్ ఫ్యాన్స్ సీరియ‌స్

By:  Tupaki Desk   |   10 Nov 2019 4:47 AM GMT
#KRKR: వ‌ర్మ‌ పై కేఏ పాల్ ఫ్యాన్స్ సీరియ‌స్
X
కాదేదీ క‌విత‌ కు అన‌ర్హం అన్నాడో క‌వి... కాదేదీ వివాదానికి అనర్హం అంటున్నాడు రామ్‌ గోపాల్‌ వ‌ర్మ‌. ఓ క‌వి దేని మీదైనా క‌విత‌ను అల్లేయ‌డం చూశాం కానీ.. వ‌ర్మ లా ఏది దొరికితే దాన్ని వివాదం గా మారుస్తూ వార్త‌ల్లో నిలవ‌డం చూడ‌నేలేదు. వివాదాల‌ తో స‌హ‌ జీవ‌నం చేయ‌డం వ‌ర్మ నైజం. ద‌ర్శ‌కుడి గా అత‌ని ఆయుష్షును పెంచిన పాయింట్ ఇది. ఏపీ ఎన్నిక‌ల వేళ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాతో త‌న‌కు కావాల్సినంత ర‌చ్చ‌ చేసి టీడీపీ ని.. చంద్రబాబు నాయుడి ని ఆడుకున్న రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో అస్త్రం తో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన విష‌యం తెలిసిందే.

వివాదాల వ‌ర్మ తాజా గా తెర‌కెక్కిస్తున్న `క‌మ్మ‌ రాజ్యంలో క‌డ‌ప‌ రెడ్లు` ప్ర‌చారార్భాటం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ని వ‌దిలిన వ‌ర్మ కేఏ పాల్ పై ఇటీవ‌ల ఓ పాట‌ని కూడా వ‌ద‌ల‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కామిక్ బుక్సుల్లో వున్న కామిక్ క్యారెక్ట‌ర్ నిజ నీవితం లోకి వ‌చ్చిన‌ట్టుంద‌ని కేఏపాల్ ని పోల్చిన వ‌ర్మ ఈ సినిమా తో మ‌రో వివాదానికి తెర‌ లేప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాని కి గురిచేస్తోంది. కేఏ పాల్ ని ఓ కామెడీ పీస్ గా తేల్చేసిన వ‌ర్మ అత‌ని పాత్ర‌ కు సినిమాలో ఓ పాట‌ని కూడా ప్ర‌త్యేకం గా రాయించి విడుద‌ల చేయ‌డం ప‌లువురిని విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

అయితే మ‌త ప్ర‌భోద‌కుడైన పాల్ ని ఆడుకున్న వ‌ర్మ‌పై ప్ర‌స్తుతం క్రైస్త‌వ మ‌త వ‌ర్గాలు సీరియ‌స్ గా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం పై సినిమా రిలీజ్ ముంగిట బోలెడంత‌ ర‌చ్చ మొద‌ల‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాల్ పై రిలీజ్ చేసిన పాటని చూస్తుంటే కేఏ పాల్‌ కు వ‌ర్మ కు మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ‌లు కావ‌డం ఖాయం గా క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఆర్జీవీ టీవీ డిబేట్ల‌ లో చంద్ర‌బాబు-లోకేష్-పాల్-ప‌వ‌న్ అంద‌రి పైనా సెటైర్లు వేస్తూ కామెడీలు చేస్తూ త‌న‌కు కావాల్సిన ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాడు. తాజాగా ఆర్జీవీ ఫేవ‌రెట్ యాంక‌ర్ స్వ‌ప్న‌తో చిట్ చాట్ లో పాల్ పై ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తో హీట్ రాజుకుంటోంది.