Begin typing your search above and press return to search.

ఈ సినిమాలో కృతిశెట్టి నోట తెలంగాణ యాస..!

By:  Tupaki Desk   |   2 March 2021 12:31 PM GMT
ఈ సినిమాలో కృతిశెట్టి నోట తెలంగాణ యాస..!
X
డెబ్యూ మూవీతో ఓ రేంజిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరోయిన్స్ అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి కోవకే చెందుతుంది ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి. ఈ కుర్రభామ వస్తూ వస్తూనే ఇండస్ట్రీని షేక్ చేసింది. అసలు ఫస్ట్ మూవీలోనే స్టార్ హీరోయిన్ రేంజిలో పెర్ఫార్మన్స్ చేసిందంటే మరి ఇంకా ముందుముందు ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాక వద్దన్నా సరే ప్రేక్షకులు థియేటర్లకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె సినిమాలు చూస్తారు. ముద్దుముద్దు మాటలతో.. అంతకన్నా క్యూట్ హావభావాలతో ఇట్టే తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది కృతిశెట్టి. ఈ కుర్రభామ వచ్చిరాగానే పలు క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టేసింది.

అయితే ప్రస్తుతం చేస్తున్న పాత్రలు బేబమ్మ పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటాయని తెలుస్తుంది. నానితో పీరియడిక్ మూవీ శ్యామ్ సింగరాయ్ లో నటిస్తున్న కృతి.. తాజాగా సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటించనుంది. సింపుల్ టైటిల్స్ తో ఆకర్శించే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈసారి కూడా అలాంటి టైటిల్ పెట్టి సర్ప్రైజ్ చేసాడు. అయితే ఈ సినిమాలో కృతి పక్కా హైదరాబాది అమ్మాయిగా కనిపించనుందని టాక్. అంతేగాక పక్కా తెలంగాణ యాసలో మాట్లాడనుందని సమాచారం. అయితే చూస్తుంటే మోహన్ కృష్ణ ఈసారి కూడా తన మార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తాడని సినీవర్గాలు చెబుతున్నాయి. సమ్మోహనం లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తర్వాత 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాతో మళ్లీ ఈ కాంబో హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేటిజన్లు. చూడాలి మరి సుధీర్, కృతి జోడి ఎలా ఉండబోతుందో!