Begin typing your search above and press return to search.
'ఈశ్వరా' అంటూ నాట్యంతో అదరగొట్టిన కృతిశెట్టి.. వీడియో వైరల్!
By: Tupaki Desk | 11 March 2021 8:51 PM ISTడెబ్యూ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసే హీరోయిన్స్ అరుదుగా కనిపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆ రేంజిలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ ఎవరంటే మాత్రం ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి అనే చెప్పాలి. ఈ కుర్రభామ మొదటి అడుగుతోనే టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పేసుకుంది. ఉప్పెన ఫస్ట్ మూవీ అయినప్పటికీ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజిలో పెర్ఫార్మన్స్ చేసిందంటే మరి ఇంకా ముందుముందు ఏ రేంజిలో ఉండబోతుందో చెప్పక్కర్లేదు. ఒక డెబ్యూ హీరోయిన్ అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే.. ప్రేక్షకులను థియేటర్లకు రావొద్దన్నా పరిగెత్తుకుంటూ వస్తారు. ఉప్పెన సినిమాలో ముద్దుముద్దు మాటలతో.. అంతకన్నా ముద్దొచ్చే హావభావాలతో అలా తెలుగు రాష్ట్రాలలో కుర్రాళ్లను అల్లాడించింది కృతిశెట్టి.
ఇక రావడంతోనే పలు క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టేసింది. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ అన్ని బేబమ్మ పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటాయట. నానితో పీరియడిక్ శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తున్న కృతి.. ఇటీవలే సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాకు ఓకే చెప్పింది. అలాగే యంగ్ హీరో రామ్ సరసన కూడా ఓ సినిమా ఓకే చేసింది. ఇదిలా ఉండగా.. కృతి చిన్నప్పుడు నాట్యం నేర్చుకుందని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇప్పుడు ఆమెలోని నాట్యకళను 'ఈశ్వరా' అనే పాటతో బయటపెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా కృతిశెట్టి సొంత ఛానల్లో విడుదల చేసిన ఈశ్వరా వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం కృతి కూచిపూడి నాట్యకళను చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.