Begin typing your search above and press return to search.

క‌న్నుగీటి సంపేస్తున్న కృతిశెట్టి.. ఖ‌మ్మంలో వైష్ణ‌వ్ తో సంద‌డి!

By:  Tupaki Desk   |   3 April 2021 10:00 PM IST
క‌న్నుగీటి సంపేస్తున్న కృతిశెట్టి.. ఖ‌మ్మంలో వైష్ణ‌వ్ తో సంద‌డి!
X
చినుకులా వ‌చ్చి.. ఉప్పెన‌లా మారిపోయింది క‌న్న‌డ బ్యూటీ కృతిశెట్టి. అటు.. తొలి సినిమాతోనే స్టార్ గా మారిపోయాడు వైష్ణ‌వ్ తేజ్‌. తెలుగు రాష్ట్రాల్లోని కుర్ర‌కారును బేబ‌మ్మ అందంతో క‌ట్టిప‌డేయ‌గా.. అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు వైష్ణ‌వ్‌. అయితే.. ఈ జంట‌కు ఫాలోయింగ్ బ‌య‌ట మామూలుగా లేదు. దీనికి నిద‌ర్శ‌న‌మే పై ఫొటో.

ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో కేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి వెళ్లారు వైష్ణ‌వ్‌-కృతిశెట్టి. అయితే.. వీరిద్ద‌రిని చూసేందుకు జ‌నాలు వేల సంఖ్య‌లో రావ‌డం విశేషం. టాప్ స్టార్లను చూడ‌డానికి వ‌చ్చిన‌ట్టుగా ఎగ‌బ‌డ్డారు. ఉప్పెన జంట‌ను చూడ్డానికి వ‌చ్చిన జ‌న సంద్రాన్ని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా అంద‌రికీ అభివాదాలు తెలిపిందీ జంట‌. అనంత‌రం ఓ సెల్ఫీకూడా తీసుకున్నారు. ఇందులో కృతిశెట్టి క‌న్నుగీటిన తీరు చూసి యువ‌కులు మ‌న‌సు పారేసుకుంటున్నారు. ఇలా క‌న్నుగీటి సంపేస్తే ఏమైపోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.