Begin typing your search above and press return to search.

అలాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం: కృతిశెట్టి క్రేజీ కామెంట్స్

By:  Tupaki Desk   |   22 May 2021 11:30 PM GMT
అలాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం: కృతిశెట్టి క్రేజీ కామెంట్స్
X
పాపులర్ నానుడి ప్రకారం పాతనీరు పోయి కొత్తనీరు వస్తూనే ఉంటుందని చెప్పినట్లుగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అదే సీన్ జరుగుతుంది. తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్స్ గా చక్రం తిప్పిన హీరోయిన్స్ అందరిని అప్ కమింగ్ హీరోయిన్స్ అలా వెనక్కి నెట్టేస్తున్నారు. అంటే ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు కొత్త అందాలను కోరుకుంటున్నారని అర్ధమవుతుంది. ఎందుకంటే హీరోయిన్స్ క్రేజ్ బట్టే ఈజీగా న్యూ కమింగ్ హీరోయిన్స్ స్టార్స్ అవుతారని సినీ ఇండస్ట్రీలో భావిస్తారు. అయితే కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఏళ్లకు పైగా కొనసాగుతున్నా స్టార్డం అందుకోలేరు. కానీ కొందరి హీరోయిన్స్ అదృష్టం ఎలా ఉంటుందంటే డెబ్యూ మూవీతోనే టోటల్ ఫ్యాన్స్ క్రష్ అయిపోతారు.

ఒక్క సినిమాతోనే వరుసగా చేతినిండా సినిమాలు సొంతం చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఫీట్ లో ఉంది కుర్రబ్యూటీ కృతిశెట్టి. ఈ ఏడాది ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి.. ఆ సినిమా రిలీజ్ ముందే సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అయితే అందుకు తగ్గట్టుగానే ఎలాంటి గ్లామర్ షోకు వెళ్లకుండా తనకు సూటబుల్ అనిపించే బబ్లీ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో నేచురల్ స్టార్ నానితో పీరియడిక్ మూవీ 'శ్యామ్ సింగరాయ్' మూవీ ఒకటి. సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాతో పాటుగా ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన కూడా ఓ మాస్ కమర్షియల్ సినిమా చేస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో అమ్మడు కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుంది.

అయితే కృతిశెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అనే సంగతి తెలిసిందే. అందుకే ఎల్లప్పుడూ వయ్యారి అభిమానులతో టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తుంటుంది. తాజాగా కృతి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగానే కృతిని ఓ ఫ్యాన్.. 'మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. ఫ్యూచర్ సినిమాల్లో ఓన్ డబ్బింగ్ చెప్తారా..?' అని అడిగాడు. దానికి సమాధానంగా కృతిశెట్టి.. 'నాకు కూడా ఓన్ డబ్బింగ్ చెప్పాలనే ఉంది. చూడాలి మరి' అని చెప్పింది. అలాగే తాజాగా ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు? అనే ప్రశ్నకు స్పందించి.. తనకు అబద్దాలు చెప్పే అబ్బాయిలంటే ఇష్టం ఉండదని.. చిరాకు అని చెప్పింది. నిజాయితీగా నిర్భయంగా మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతాను అంటూ కుర్రకారుకు అభిప్రాయం వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం పై కృతి ఫ్యాన్స్ తెగకామెంట్స్ చేస్తున్నారు.