Begin typing your search above and press return to search.

బుల్లెట్ సాంగ్‌పై గ్రూవింగ్ అదిరింది బేబ‌మ్మ‌!

By:  Tupaki Desk   |   4 May 2022 11:30 AM GMT
బుల్లెట్ సాంగ్‌పై గ్రూవింగ్ అదిరింది బేబ‌మ్మ‌!
X
ముంబై బ్యూటీ కృతిశెట్టి అలియాస్ బేబ‌మ్మ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 'ఉప్పెన'..'బంగార్రాజు' చిత్రాల‌తో ఫుల్ ఫామ్ లో ఉంది. అందచందాల‌తో యువ‌త‌ని ఆక‌ర్షించ‌డంలో ముందుంది. న‌టిగా ఎలాంటి పాత్ర‌ల‌కైనా సిద్ద‌మేనంటూ ముంబై భామ‌ల‌కే స‌వాల్ విసిరింది. తొలి సినిమాతోనే త‌న ట్యాలెంట్ మొత్తం చూపించింది అమ్మ‌డు. దీంతో టాలీవుడ్ మేక‌ర్స్ క‌ళ్లు అమ్మ‌డిపై బాగానే ప్ర‌స‌రిస్తున్నాయి.

తొలి సినిమా స‌క్సెస్ తో పాటు ఇంప్రెసివ్ గాళ్ల్ గా ముద్ర ప‌డటంతో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. ఇక అమ్మ‌డి సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం ఇన్ స్టారీల్స్ ని హీటెక్కిస్తుంది. 'బీస్ట్' సినిమాలో అర‌బికుత్ సాంగ్ తో ఇన్ స్టాలో మంచి లైక్ లు సంపాదించింది. త‌న‌దైన గ్లామ్ షో తో కుర్రాళ్ల మ‌న‌సును దోచేస్తుంది.

తాజాగా అమ్మ‌డు 'ది వారియ‌ర్' సినిమా టార్గెట్ చేసింది. అందులోనూ 'బుల్లెంట్ సాంగ్' పై కృతి గ్రూవింగ్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. బుల్లెంట్ సాంగ్ లో అమ్మ‌డు న‌వ్వుతూ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ త‌న‌దైన శైలి డాన్స్ తో ఆక‌ట్టుకుంది. ప‌సుపు-ప‌చ్చ‌ బొమ్మల ష‌ర్ట్..మ్యాచింగ్ జీన్స్ ప్యాంట్ దుస్తుల్లో ఆక‌ట్టుకుంటుంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. కృతి అభిమానులు భారీగా లైక్ లు కొట్టారు. ఇప్ప‌టివ‌ర‌కూ ల‌క్ష‌కు పైగా లైక్ లు వ‌చ్చాయి. ఈ పాట‌లో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ స‌ర‌స‌న‌ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన‌ర్జిటిక్ స్టార్ ఎన‌ర్జీని మ్యాచ్ అయ్యే ప్ర‌య‌త్నం చేసింది. ఈ పాట లిరిక‌ల్ వీడియో ఇప్ప‌టికే నెట్టింట దుమారం రేపింది.

పాట‌లో రామ్..కృతిశెట్టి ఆక‌ట్టుకున్నారు. తాజా వీడియోతో బుల్లెంట్ సాంగ్ కి కృతి మ‌రింత హైప్ తీసుకొచ్చింది. ' ది వారియ‌ర్' చిత్రానికి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తెలుగు..త‌మిళ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కృతి నితిన్ స‌ర‌స‌న 'మాచ‌ర్ల‌ నియోజ‌క వ‌ర్గం'లోనూ న‌టిస్తోంది. ఇంకా కృతి న‌టిస్తోన్న కొన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. కొత్త అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి.