Begin typing your search above and press return to search.

బేబ‌మ్మ సాహ‌సం చేస్తోందా?

By:  Tupaki Desk   |   9 Dec 2021 6:30 AM GMT
బేబ‌మ్మ సాహ‌సం చేస్తోందా?
X
తొలి చిత్రం ఇచ్చి ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందా.. అందులో న‌టించిన వారికి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేస్తారు. అలాంటి క్రేజ్‌ని తొలి చిత్రంతో ద‌క్కించుకుంది కృతిశెట్టి.

తెలుగులో ఆమె న‌టించిన `ఉప్పెన‌` చిత్రం ఏ స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసి త‌న మాయ‌లో ప‌డేసింది. తొలి చిత్మే అయినా బేబ‌మ్మ‌గా జ‌నాల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది.

ఈ సినిమా అందించిన క్రేజ్‌తో ఏకంగా నాలుగు క్రేజీ చిత్రాల్లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ నాలుగు చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా కృతిశెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీలో న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌పైకి రానున్న‌ ఈ చిత్రాన్ని ఉయ్యాలా జంపాలా, మ‌జ్ను చిత్రాల ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలిసింది.

హీరోయిన్ పాత్రని ప్ర‌ధానంగా చేసుకుని ఓ స‌రికొత్త క‌థ‌ని విరించి వ‌ర్మ సిద్ధం చేసుకున్నార‌ట‌. ఇప్ప‌టికే బేబ‌మ్మ కృతిశెట్టిని సంప్ర‌దించే ప్ర‌య‌త్నాల్లో వున్నార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఇంత త్వ‌ర‌గా బేబ‌మ్మ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అంటే కెరీర్ ప‌రంగా రిస్క్ క‌దా అని కొంత మంది అభిమానులు పెద‌వి విరుస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో బేబ‌మ్మ సాహ‌సం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే అంటున్నారంతా.