Begin typing your search above and press return to search.

బేబ‌మ్మ మెగా ఆఫ‌ర్ తో డేరింగ్ స్టెప్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 2:30 AM GMT
బేబ‌మ్మ మెగా ఆఫ‌ర్ తో డేరింగ్ స్టెప్‌
X
స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ ...సుకుమార్‌తో క‌లిని చేసిన చిత్రం `ఉప్పెన‌`. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే కాకుండా వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టించిన చిన్న చిత్రాల్లో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు నెల‌కొల్పింది. ఈ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది కృతిశెట్టి.

బేబ‌మ్మ‌గా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుతో పాటు పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్ప‌డు టాలీవుడ్ లో బేబ‌మ్మ క్రేజీ హీరోయిన్. తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `శ్యామ్ సింగ రాయ్‌`లో మోడ్ర‌న్ యువ‌తిగా న‌టించిన లిప్ లాక్ ల‌తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ప్ర‌స్తుతం `బంగార్రాజు` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

సుధీర్ బాబుతో క‌లిసి `ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ తో `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`, హీరో రామ్ తో ఎన్ లింగుసామి రూపొందిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీల‌లో న‌టిస్తూ య‌మ బిజీగా వుంది. అయితే తాజాగా కృతిశెట్టి మ‌రో మెగా ఆఫ‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డం విశేషం. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి డాట‌ర్ సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌బోతున్నారు.

`షూట్ ఔట్ ఎల్ ఆలేర్‌` వెబ్ సిరీస్ తో నిర్మాణ సంస్థ‌ని స్థాపించి తాజాగా న‌ట‌కిరిటీ డా. రాజేంద్ర ప్రాసాద్‌తో నిర్మించిన `సేనాప‌తి` వెబ్ ఫిలింతో ప్ర‌శంస‌ల్ని అందుకున్నారు. తృతీయ ప్ర‌య‌త్నంగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించ‌బోతున్నారు సుష్మిత‌. `ఉయ్యాల జంపాల‌`, `మ‌జ్ను` వంటి చిత్రాల‌ని అందించి ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విరించి వ‌ర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

విరించి వ‌ర్మ `మ‌జ్ను` త‌రువాత మ‌రో సినిమా చేసి చాలా రోజుల‌వుతోంది. అంతే కాకుండా ఆయ‌న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తో సినిమా చేయాల‌ని రెడీ అయ్యారు కూడా.. కానీ ఆ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా కృతిశెట్టితో లేడీ ఓరియెంటెడ్ మూవీకి రెడీ అయిపోయారు. మోడ్ర‌న్ యువ‌తి చుట్టూ సాగే చిత్రంగా ఈ మూవీ యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది.

ఆర‌వ చిత్రానికే మహిళా ప్ర‌ధాన చిత్రం చేస్తుండటంతో కృతిశెట్టి చాలా డేరింగ్ స్టెప్ వేస్తోంద‌ని, అనుష్క శెట్టి 12 చిత్రంగా లేడీ ఓరియోవంటెడ్ మూవీగా రూపొందిన న‌`అరుంథ‌తి` మూవీలో న‌టిస్తే కృతిశెట్టి మాత్రం ఆర‌వ చిత్రాకే ఇలా డేరింగ్ స్టెప్ వేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విరించి వ‌ర్మ డైరెక్ష‌న్ లో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సుష్మిత నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.