Begin typing your search above and press return to search.

బేబమ్మలా ఈ పాత్ర అంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   19 Dec 2021 3:58 AM GMT
బేబమ్మలా ఈ పాత్ర అంత ఈజీ కాదు
X
నాని - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో రూపొందిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా, ఈ నెల 24వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై మెరూన్ - పింక్ కలర్ లంగా ఓణీలో కృతి శెట్టి మల్లెపువ్వులా విరిసింది. చందమామను నక్షత్రాలతో అలంకరించినట్టుగా జిగేల్ మంటూ మెరిసింది. ఆమెను చూడగానే కుర్రాళ్లంతా తమ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. ఈలలు .. అరుపులు సద్దుమణగడానికి కొంతసమయం పట్టింది. తెలుగులో కూడబలుక్కుంటూనే తాను చెప్పదలచుకున్న విషయాన్ని కృతి శెట్టి చాలా స్పష్టంగా చెప్పేసింది.


ఆమె మాట్లాడుతూ .. "ఇక్కడికి వచ్చిన అతిథులకు .. నా లవ్లీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఏం చేసినా అది మీ కోసమే ఉంటుంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర మీరంతా ఇష్టపడిన బేబమ్మలా లేదు .. కృతిలా కూడా లేదు. ఈ పాత్రను చేయడానికి నేను చాలా ఛాలెంజెస్ ను ఫేస్ చేయవలసి వచ్చింది. మీకు ఒక కొత్త ఫీల్ ను ఇస్తానని ఇచ్చిన మాట నేను కష్టపడేలా చేసింది. నేను ఎక్కడికి వచ్చినా మీరు ఎంతో ప్రేమిస్తున్నారు .. చాలా బాగా అనిపిస్తోంది. ఈ సినిమాలో నేను పోషించిన కీర్తి పాత్రకి యూత్ బాగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను .. కోరుకుంటున్నాను.

రాహుల్ గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను .. ఆయన ఈ పాత్రను నాకు ఇచ్చినందుకు .. నాపై కాన్ఫిడెంట్ గా ఉన్నందుకు. నాని గారికి కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను .. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. నా నుంచి ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన ఎంతో సహకరించారు. ఇక ఈ సినిమాలో సాయిపల్లవిగారి యాక్టింగ్ చూసి మీరంతా కూడా 'ఫిదా' అయిపోతారు. మడోనా చాలా స్వీట్ .. తన పాత్రను చాలా బాగా చేసింది. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. వాళ్లందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

ప్రొడ్యూసర్ వెంకట్ గారు సో .. సో స్వీట్. ఇది ఆయన మొదటి సినిమాలా అనిపించలేదు. ఈ సినిమా విజువల్స్ లోనే మీకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ తెలుస్తాయి. సానూ సార్ వండర్ ఫుల్ విజువల్స్ ను చూపించారు. ప్రతి ఫ్రేమ్ ద్వారా ఆయన ఈ కథను మరింత బాగా చెప్పడానికి ప్రయత్నిచారు. అవినాశ్ గారికీ .. నవీన్ నూలి గారికీ .. మీడియా వారందరికీ ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను. మనం ఒక సినిమా చూసేటప్పుడు తెరపైన ఉన్నవారిని మాత్రమే చూస్తుంటాము. కానీ దాని వెనుక ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంటుంది. వాళ్లందరినీ ప్రతి ఒక్కరూ చప్పట్లతో అభినందించాలి" అని చెప్పుకొచ్చింది.