Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాను కాదన్న మరో హీరోయిన్‌

By:  Tupaki Desk   |   28 Feb 2022 7:30 AM GMT
బాలయ్య సినిమాను కాదన్న మరో హీరోయిన్‌
X
నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్నాయి. అఖండ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్‌ మలినేని మరియు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న విసయం తెల్సిందే. ఇప్పటికే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కి జెట్‌ స్పీడ్‌ తో దూసుకు పోతుంది. త్వరలోనే షూటింగ్‌ ముగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో అనీల్‌ రావిపూడి సినిమా స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అయ్యింది. షూటింగ్‌ కు రెడీ అవుతున్నారు.

బాలకృష్ణ హీరోగా సినిమా మొదలు అనగానే హీరోయిన్‌ సమస్య ప్రతి సారి వస్తుంది. గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హీరోయిన్ విషయంలో కూడా చర్చ తప్పలేదు. ఇప్పటికే ఈ సినిమా లో ఇప్పటికే శృతి హాసన్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఆమెకు ముందు పలువురు హీరోయిన్స్ ను సంప్రదించారనే వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంతో తెలియదు. శృతి హాసన్‌ కూడా మొదట నో చెప్పినా ఆ తర్వాత ఓకే అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

బాలకృష్ణ కు జోడీగా శృతి హాసన్ కన్ఫర్మ్‌ అయ్యింది. సినిమాలో బాలయ్య ద్వి పాత్రాభినయం అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో కీలక పాత్ర కోసం కృతి శెట్టిని అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు సోషల్‌ మీడియా లో వైరల్‌ అయ్యాయి. అఖండ సినిమా ఘన విజయంతో బాలయ్య సినిమాలకు మంచి బజ్‌ ఉంది. కనుక కృతి శెట్టి కూడా ఓకే అంటుందని అంతా అనుకున్నారు.

కాని అనూహ్యంగా బాలయ్య సినిమాలో కృతి శెట్టి కీలక పాత్రలో నటించాలంటూ వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరష్కరించిందట. బాలయ్య కు కూతురు పాత్రలో నటించేందుకు కృతి శెట్టి నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి తగ్గేదే లే అంటూ స్టార్‌ హీరోయిన్ రేంజ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అదే స్థాయిలో ఆమెకు బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లు దక్కుతున్నాయి.

ఇలాంటి సమయంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎలా చేస్తుందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప్పెన సినిమా తర్వాత ఆమె స్థాయి అమాంతం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్‌ సింగ రాయ్ మరియు బంగార్రాజు సినిమాలు ఆమె స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలబెట్టాయి. అలాంటి కృతి శెట్టి హీరోయిన్ గానే.. అది కూడా యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లోనే నటించాలని భావిస్తుంది. అలాంటి సమయంలో హీరోయిన్ గా కాకుండా బాలయ్య కు కూతురుగా.. కీలక పాత్రలో నటించాలంటే ఎలా అంటూ ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలే బాలయ్య 107 సినిమా ఫస్ట్‌ లుక్ విడుదల అవ్వడంతో సినిమా పై అంచనాలు పీక్స్ కు వెళ్తున్నాయి. కృతి శెట్టి నో చెప్పిన ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చూడాలి. ఇదే ఏడాది ద్వి తీయార్థం లో సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ను మాత్రం వచ్చ ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.