Begin typing your search above and press return to search.

గతాన్ని గుర్తు చేసి అందరికి షేర్ చేసి షాకిచ్చింది

By:  Tupaki Desk   |   30 Aug 2021 3:31 AM GMT
గతాన్ని గుర్తు చేసి అందరికి షేర్ చేసి షాకిచ్చింది
X
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందునా గ్లామర్ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో అన్ని ఎదురుదెబ్బలే అన్నట్లుగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. టాలీవుడ్ లో తాను చేసిన తొలి సినిమానే డిజాస్టర్ కావటం.. మాంచి హైట్ ఉన్న కృతి సనన్‌ కు అవకాశాలు కష్టమేమో అన్న భావనకు భిన్నంగా ఆమె వరుస సినిమాలు చేయటం తెలిసిందే.

ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ వసూలు చేసే బ్యూటీల్లో ఈ సన్నజాజి మొగ్గ కూడా చెబుతారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో గతం గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీబిజీగా ఉన్న ఆమె.. గతంలో మోడల్ గా చేసిన సందర్భంగా తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్నిషేర్ చేసింది. తాను మోడల్ గా పని చేసే సమయంలో.. తన మొదటి ర్యాంప్ వాక్ లో ఆమె పొరపాటుగా వ్యవహరించింది. దీంతో..సదరు కొరియోగ్రాఫర్ ఏడాపెడా వాయించేసినట్లుగా తిట్టేయటమే కాదు..అసభ్యంగా కూడా వ్యవహరించాడట.

ర్యాంప్ షో ముగిసిన తర్వాత 20 మంది మోడళ్ల ముందు తనను కొరియాగ్రాఫర్ అవమానించటంతో తాను ఆటోలో కూర్చొని బోలెడంత సేపు ఏడ్చినట్లుగా చెప్పింది. అలా ఏడ్చుకుంటూనే ఇంటికి వెళ్లినప్పుడు.. తన తల్లి తనకు ఒక స్ఫూర్తివంతమైన మాట చెప్పినట్లుగా పేర్కొంది. సినిమా ఇండస్ట్రీలో రాణిస్తావో లేదో కానీ.. ముందు నువ్వు మానసికంగా మరింత బలంగా ఉండాలని చెప్పారట.

అప్పటి నుంచి తన తల్లి చెప్పిన మాటల్ని మననం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అప్పట్లో దొర్లిన తప్పునకు అంతలా అవమానానికి గురైన కృతి సనన్ ఈ రోజున.. బిజీబిజీ స్టార్ గా మారారని చెప్పాలి. సక్సెస్ ఫుల్ గా ఉన్న వారిని కదిలిస్తే.. ఇలాంటి చేదు అనుభవాలతో పాటు.. ఎన్నో ఎదురుదెబ్బల అనంతరమే ఇలాంటి స్టార్ డమ్ సొంతమవుతుందన్నది మర్చిపోకూడదు.