Begin typing your search above and press return to search.

అప్పుడే కృతి సేనన్‌కు 1 కోటి...

By:  Tupaki Desk   |   8 Jun 2015 1:15 PM IST
అప్పుడే కృతి సేనన్‌కు 1 కోటి...
X
1నేనొక్కడినే, దోచెయ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది కృతిసనోన్‌. ఆరంగేట్రమే మహేష్‌ అంతటి సూపర్‌స్టార్‌ సరసన నాయికగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే తీరుగా హీరో ప్యాంటీ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసి పెద్ద సక్సెస్‌ అందుకుంది. ఉత్తరాదిన వన్‌ ఫిలిం వండర్‌గా ఈ అమ్మడికి గుర్తింపు వచ్చింది.

రెండో అవకాశమే బాద్‌షా షారూక్‌ఖాన్‌ సరసన ఛాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం షారూక్‌ హీరోగా దిల్‌వాలే షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కృతి నటిస్తోంది. సినిమా ఆన్‌సెట్స్‌ ఉండగానే అమ్మడిని భారీ ఆఫర్లు వరిస్తున్నాయి. వాణిజ్య ప్రకటనల కంపెనీలు వరుసగా క్యూకడుతున్నాయి. ఓ బ్యూటీ ప్రొడక్ట్‌ కంపెనీ కోటి మొత్తం చెల్లించి కృతితో ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం బ్రాండ్‌ ప్రచారం కోసం ఇంత పెద్ద మొత్తానికి, అదీ ఓ ఆరంభ నటితో డీల్‌ కుదరడం అనేది ఇదే తొలిసారి.

దీపిక పదుకొన్‌, కత్రిన, కరీనా సైతం ఆరంభమే ఇంత పెద్ద డీల్‌ కుదుర్చుకోలేదు. ఆ లెక్కన కృతి వేరే నాయికలు తీవ్రమైన పోటీ ఇస్తున్నట్టే. నవతరం నాయికల్లో సోనమ్‌ కపూర్‌, సోనాక్షి, శ్రద్ధాకపూర్‌, ఆలియాభట్‌లకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తోంది అమ్మడు.