Begin typing your search above and press return to search.

మహేష్ హీరోయిన్ కి ఆ ప్రాబ్లెం లేదట

By:  Tupaki Desk   |   18 Sept 2017 11:09 AM IST
మహేష్ హీరోయిన్ కి ఆ ప్రాబ్లెం లేదట
X
కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది కానీ.. మనోళ్లకు మాత్రం మహేష్ హీరోయిన్ గానే గుర్తుండిపోయింది. 1నేనొక్కడినే చిత్రంలో సూపర్ స్టార్ తో కలిసి ఆడిపాడిన ఈ భామకు.. ఆ మూవీ ఫ్లాప్ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి కానీ.. ఈ అమ్మడు మాత్రం బాలీవుడ్ రైలు ఎక్కేసి అక్కడే అదృష్టం పరీక్షించుకోవడంలో బిజీ అయిపోయింది.

ప్రస్తుతం హైద్రాబాద్ లో ఓ యూత్ సమ్మిట్ కోసం వచ్చిన కృతి సనోన్ కు.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే.. ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయన్న కృతి.. తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెప్పడం విశేషం. "నేను ఒక ఇంజినీర్ ని. సినిమా హీరోయిన్ కావడం అంటే.. కెరీర్ లో పెద్ద మార్పు వచ్చినట్లే. కొంత పోగొట్టుకున్నా.. ఓ పెద్ద కలను నెరవేర్చుకో గలుగుతున్నాను. బాలీవుడ్ లోనే కాదు.. అనేక ప్రాంతాల్లో.. ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. అదృష్టవశాత్తూ నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. నేను ఓ ఏజెన్సీకి సైన్ చేశాను. అక్కడి నుంచి వచ్చిన ఆఫర్స్ కు మాత్రమే సైన్ చేస్తున్నాను" అని చెప్పింది కృతి.

ఈమె శరీర తత్వాన్ని బాలీవుడ్ లో తోటి మహిళలే వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే.. ఫెయిల్యూర్స్ కు కానీ.. ఇలాంటి విమర్శలకు కానీ భయపడకూడదని.. ఇవన్నీ మనల్ని మరింత శక్తివంతులుగా చేస్తాయని చెబుతోంది కృతి. "నువ్వు ఇది చెయ్యలేవు" అని చెప్పే అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు అన్నది కృతి సిద్ధాంతం. బాగుంది కదూ.