Begin typing your search above and press return to search.

#ఆదిపురుష్ 3డి.. సీతాదేవికి శ్రీ‌రాముని ఆత్మీయ స్వాగ‌తం

By:  Tupaki Desk   |   12 March 2021 3:30 AM GMT
#ఆదిపురుష్ 3డి.. సీతాదేవికి శ్రీ‌రాముని ఆత్మీయ స్వాగ‌తం
X
డార్లింగ్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ 3డి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. కొన్ని వ‌రుస ఘ‌ట‌న‌ల అనంత‌రం షూటింగ్ నిరాఘంటంగా సాగుతోంది.

తాజాగా ఆదిపురుష్ టీమ్ లో జాయిన‌య్యారు కృతి స‌నోన్. ఇదిగో ఇలా ప్ర‌భాస్ - స‌న్నీసింగ్ ల‌తో క‌లిసి కృతి ఫోటోల‌కు ఫోజులిచ్చారు. ఆ ముగ్గురితో ద‌ర్శ‌కుడు ఓంరౌత్ కూడా ఉన్నారు.

కృతి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క 3డి యాక్ష‌న్ చిత్రంలో సీతాదేవిగా క‌నిపించ‌నున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా.. స‌న్నీసింగ్ ల‌క్ష్మ‌ణుడిగా క‌నిపిస్తారు. సైఫ్ ఖాన్ రావ‌ణాసురుడి పాత్ర‌లో నటిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై చిత్రీక‌ర‌ణ నేప‌థ్యంలో సీతాదేవి పాత్ర‌ధారి చేరిక‌తో టీమ్ లో నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. కృతి సనోన్ కు టీమ్ నుంచి ఘ‌న‌మైన‌ ఆత్మీయ స్వాగతం ల‌భించింది.

ఇన్నాళ్లకు సీత పాత్ర‌ధారి పై స‌స్పెన్స్ వైదొల‌గింది. అనుష్క శర్మ- అనుష్క శెట్టి- కీర్తి సురేష్- కియారా అద్వానీ తదితర భామ‌ల పేర్లు గ‌త కొద్దిరోజులుగా తెర‌పైకి వ‌చ్చాయి. కానీ వీళ్ల‌లో ఎవ‌రూ ఎంపిక కాలేదు. జాబితాలో అంద‌రినీ వెన‌క్కి నెట్టేసి కృతి సనోన్ చోటు ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ఆదిపురుష్ కుటుంబంలోకి ఆత్మీయ స్వాగ‌తం అంటూ ప్ర‌భాస్ స్వ‌యంగా కృతిని ప్ర‌భాస్ స్వ‌యంగా ఆహ్వానించ‌గా వంద‌శాతం ఆ పాత్ర‌పై క్లారిటీ వ‌చ్చేసింది.

ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది .. #ఆదిపురుష్ ... ఇది చాలా ప్రత్యేకమైనది .. గర్వంగా.. గౌరవంగా ఈ మాయా ప్రపంచంలో భాగం కావడం సంతోషంగా ఉంది.. అంటూ కృతి ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యారు. చెడు మీద మంచి విజ‌యం .. ఆ వేడుకలో చేరడం.. ఆదిపురుష్ కుటుంబంలో భాగం కావడం సంతోషంగా ఉంద‌ని స‌న్నీసింగ్ వ్యాఖ్య‌ను జోడించారు. గత నెలలోనే ల‌క్ష్మ‌ణుడు పాత్ర‌ధారి.. నటుడు సన్నీ సింగ్ కు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ నుండి ఆత్మీయ స్వాగతం లభించింది.

ఈ ఏడాది జనవరిలో ఆదిపురుష్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. అయితే సెట్స్ లో భారీగా మంటలు చెలరేగడంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం క‌థాంశం ప్ర‌కారం.. ఎక్కువగా స్టూడియోలో చిత్రీకర‌ణ సాగుతోంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన విఎఫ్‌.ఎక్స్ సాంకేతిక నిపుణులతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతున్నారని తెలిసింది. అవతార్ - స్టార్ వార్స్ వంటి భారీ చిత్రాలకు పనిచేసిన టెక్నిక‌ల్ టీమ్ ని ఈ చిత్రం కోసం ఒప్పిస్తున్నార‌ట‌. 3డి యాక్షన్ డ్రామా ఆదిపురుష్ 3డి 2022 ఆగస్టు 11న థియేట‌ర్ల‌లోకి రిలీజ్ కానుంది.