Begin typing your search above and press return to search.

గత జన్మ బంధమేమో ఈ గుర్రం

By:  Tupaki Desk   |   17 May 2017 7:15 AM GMT
గత జన్మ బంధమేమో ఈ గుర్రం
X
1-నేనొక్కడినే ఫేం దిల్లీ బ్యూటీ కృతి సనోన్.. హీరోపంతితో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే ట్రాక్ లోనికి పడింది. తరవాత షారుక్ ఖాన్ సినిమా దిల్ వాలే తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఫ్లాపులే అయినా కూడా.. అమ్మడికి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తన కొత్త సినిమా రాబ్తా ప్రమోషన్ పనుల్లో బిజీగా తిరుగుతోంది. ఈ సినిమా పూర్వ జన్మ ప్రేమ కథనంతో మన మగధీర సినిమాలా సాగుతుంది.

ఈ సినిమాలో కృతికి జోడీగా నటిస్తుంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈ సినిమా రెండు ప్రేమ కథలుగా ఉంటాయoట ఒకటి గత జన్మలో మరికటి ఇప్పటి కాలపు ప్రేమ కథ. ఈ సినిమా కోసం కృతి సనోన్ గుర్రపు స్వారీ నేర్చుకుందట. రాబ్తా సినిమాలో కొన్ని సన్నివేశాలలో కృతి గుర్రపు స్వారీ చేయవలిసి వస్తుంది. ఈ ట్రైనింగ్ టైంలో కృతి గుర్రాలు పైన ఇష్టం పెంచుకుందట. ఒక ఇంటర్వ్యూ లో “నేను సినిమా కోసం నేర్చుకున్న ఈ గుర్రపు స్వారీ నాకు బాగా నచ్చింది ఈ ఆటను నేను సినిమా తరవాత కూడా కొనసాగిస్తాను” అని చెప్పింది.

ఈ సినిమా ట్రెయిలర్ విడుదలైనప్పుడు మగధీరకు కాపీ అన్నారు అంతా. కానీ ఆ చిత్ర యూనిట్ మాత్రం పూర్వ జన్మ ప్రేమ ఒకటే అలా ఉంటుంది కానీ మొత్తం పాత్రలు కథ కథాంశం అన్నీ విబిన్నంగా ఉంటాయి అన్నీ చెబుతున్నారు. సుశాంత్ తో కృతి జోడీ కూడా బాగానే వర్క్ ఔట్ అయింది ఈ సినిమాలో. అందుకనేమో వీళ్ళద్దరికి అప్పుడే సంబంధం కూడా ఉంది అని వార్తలు వచ్చేసాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/