Begin typing your search above and press return to search.

సంతోషాన్ని పెంచుకుంటోంది

By:  Tupaki Desk   |   10 Sept 2017 12:17 PM IST
సంతోషాన్ని పెంచుకుంటోంది
X
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా తో వెండితెరకు పరిచయమైన భామ కృతి సనోన్. మోడల్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రం స్టార్ గా ఎదగడానికి తెగ కష్టపడుతోంది. ఇప్పటివరకు అమ్మడికి సరైన పాత్ర తగలకపోవడంతో విజయం దక్కలేదేమో మొత్తానికి హిట్ కొట్టేసి బాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టిలో పడింది.

అమ్మడు గత నెల 18న రిలీజ్ చేసిన బరేలి కి బర్ఫీ అనే సినిమా విడుదల చేసింది. సినిమాలో కథాంశం అందరికి కనెక్ట్ అవ్వడంతో పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. నటనలో కూడా అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే అమ్మడు సినిమాలో కాస్త డి-గ్లామ్ అవతార్ లో సరికొత్తగా మెరిసింది. సిగరెట్-మందు వంటి అలవాట్లతో పర్ఫెక్ట్ గా పాత్రకు న్యాయం చేసింది.

ఫైనల్ గా కృతి సనన్ మంచి బాక్స్ ఆఫీసు హిట్ ను అందుకుంది. దీంతో ఆ విజయాన్ని బాగా ఎంజాయ్ చేయాలని అమ్మడు ప్లాన్ వేసిందట. ఇప్పటికే ఆమె స్పెయిన్ లో ఓ బ్రాండ్ యాడ్స్ తో బిజీగా వుంది. దీంతో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకాస్త సంతోషంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో విహార యాత్రలు చేయడానికి ఫిక్స్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఫర్జి అనే సినిమాతో బిజీ కానుంది కృతి.