Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ప్రేమజంట అక్కడ దొరికేశారు

By:  Tupaki Desk   |   3 Jan 2017 3:30 PM GMT
బాలీవుడ్ ప్రేమజంట అక్కడ దొరికేశారు
X
బాలీవుడ్ లో బ్రేకప్ కహానీలు ఎన్ని వినిపిస్తాయో.. అంతకు మించి కొత్త లవ్ స్టోరీలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏదైనా సినిమాలో ఓ ఇద్దరు కలిసి నటిస్తుంటే.. వారిద్దరి మధ్య రిలేషన్ ను అంటగట్టేయడం.. ప్రచారం కోసం అన్నట్లుగా రూమర్లకు ఛాన్స్ ఇచ్చేలా వీరు ప్రవర్తించడం సహజంగా జరిగేదే. కానీ సినిమాలకు అతీతంగా కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. కృతి సనోన్ ల ప్రేమపై వార్తలు వస్తుంటాయి.

కలిసి కనిపిస్తూనే ఉంటారు కానీ.. అడిగితే మాత్రం అబ్బెబ్బే అన్నీ పుకార్లే అనేస్తూ ఉంటారు. తాజాగా ఈ ప్రేమ జంట కొత్త సంవత్సర వేడుకలు కలిసి జరుపుకోవడం.. ఈ రూమర్లకు మరింతగా బలం చేకూర్చింది. మనకు అతి దగ్గరైన వ్యక్తులతో న్యూ ఇయర్ ఆహ్వానించడం అందరికీ అలవాటు. అలాగే చాలా ప్రేమపక్షులు రకరకాల ప్రాంతాలకు ఎగిరిపోగా.. సుశాంత్-కృతిలు లండన్ లో తేలారు. ఇలా సెల్ఫీలు కూడా దిగి సందడి చేసారు.

అయితే.. వీరేమీ ఒంటరిగా వెళ్లిపోలేదు. రాబ్టా మూవీ దర్శకుడు దినేష్ విజన్.. అతని సోదరి పూజా విజన్ లతో కలిసి సుసాంత్ సింగ్ రాజ్ పుత్-కృతి సనోన్ లు లండన్ ఒకరితో ఒకరు సెల్ఫీలు దిగి తమ సోషల్ సైట్లలో పోస్ట్ చేసి తమ సంబరాలను చూపించారు. వీటిలో సుశాంత్-కృతిలు అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న ఫోటో.. వీరి ప్రేమకు ప్రతిరూపం అనే కామెంట్స్ బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/