Begin typing your search above and press return to search.

సిగ్గు ప‌డుతూనే గ్యాపివ్వ‌డ‌ని ప్ర‌భాస్ గుట్టు లీక్ చేసింది!

By:  Tupaki Desk   |   25 March 2021 3:30 AM GMT
సిగ్గు ప‌డుతూనే గ్యాపివ్వ‌డ‌ని ప్ర‌భాస్ గుట్టు లీక్ చేసింది!
X
ఇంత‌కుముందు సాహో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌గా శ్ర‌ద్ధా క‌పూర్ కి రెగ్యుల‌ర్ గా ప్ర‌భాస్ ఇంటి నుంచి క్యారేజీ అందేది. అందులో ర‌క‌ర‌కాల వంట‌కాలు రుచి చూశాక‌.. జీవితంలో ఇంత‌కుమించిన విందు భోజ‌నం త‌న‌కు మ‌రొక‌టి దొర‌క‌ద‌ని కితాబిచ్చేసింది శ్ర‌ద్ధా. రాజుల భోజ‌నమా మ‌జాకానా అంటూ ముచ్చ‌టించుకున్నారంతా. అలాగే ప్ర‌భాస్ లోని సిగ్గ‌రి గురించి మొహ‌మాట‌స్తుడి గురించి కూడా ఉన్న‌దున్న‌ట్టు చెప్పింది శ్ర‌ద్ధా.

ఇప్పుడు ఆదిపురుష్ 3డి సెట్స్ లో జాయినైన కృతికి ఇంచుమించు అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ప్ర‌భాస్ లోని అతిథి మ‌రోసారి నిదుర లేచాడ‌ట‌. త‌న తోటివారికి సెట్లో క్యారేజీలు అందుతున్నాయ‌ట‌. అలాగే క‌థానాయిక `సీత‌` పాత్ర‌ధారి అయిన కృతి స‌నోన్ కి అద్భుత వంట‌కాల‌తో క్యారేజీలు తినిపిస్తున్నార‌ట‌. డార్లింగ్ ఆతిథ్యం గురించి ఎంతో మురిపెంగా చెప్పుకొచ్చింది కృతి.

తాను తినేట‌ప్పుడు తన సహనటులకు ఆహారం ఇవ్వడాన్ని ప్ర‌భాస్ చాలా ఇష్టప‌డ‌తార‌ని కృతి తెలిపారు. ప్రారంభంలో సిగ్గుపడుతున్నప్పటికీ ప్రభాస్ విరామం లేకుండా మాట్లాడుతుంటారు. గంట‌ల కొద్దీ స‌మ‌యం మాట్లాడుతారు! అంటూ కాస్త కొత్త విష‌యం కూడా చెప్పింది కృతి. మొత్తానికి ప్ర‌భాస్ ఆతిథ్యం రుచి చూసిన క‌థానాయిక‌ల జాబితాలో చేరిన‌ కృతి అదృష్టంపై ఇత‌రులు కుళ్లుకుంటున్నారు.

ఆదిపురుష్ షూటింగ్ తో పాటు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న ప్ర‌భాస్ త‌దుప‌రి నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ సినిమాని ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇవ‌న్నీ 2021-22 సీజ‌న్ లో రిలీజ్ కి రెడీ అవుతాయి. ఆదిపురుష్ చిత్రంతో పాటు భేడియా అనే హార‌ర్ చిత్రంలోనూ కృతి క‌థానాయిక‌గా న‌టిస్తోంది.