Begin typing your search above and press return to search.

హాట్ హాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న కృతి కర్బందా

By:  Tupaki Desk   |   20 March 2020 6:10 AM GMT
హాట్ హాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న కృతి కర్బందా
X
'బోణీ' సినిమాతో వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి కర్బందా. ఈ సినిమాతో టాలీవుడ్ లో బోణీ కొట్టలేకపోయినా మంచి అవకాశాలనే చేజిక్కుంచుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి 'తీన్ మార్' చిత్రంలో నటించినా కృతి ఫేట్ మాత్రం మారలేదు. ఒంగోల్ గిత్త, మిస్టర్ నూకయ్య, ఓమ్ తదితర చిత్రాలలో నటించిన కృతి చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో కనిపించింది. ఎందుకో తెలియదు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రామ్, మంచు మనోజ్, సుమంత్ లాంటి పెద్ద హీరోల పక్కన నటించినా క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది.

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా ఏ ఇండస్ట్రీని వదిలి పెట్టకుండా అన్ని సినీ ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందంతో పాటు అభినయం కలబోసిన ఈ భామ ఎందుకో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. అయినా పట్టు విడువకుండా పక్క ఇండస్ట్రీలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బాలీవుడ్‌లో కూడా ఇప్పుడు వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా 'హౌజ్ ఫుల్ 4', 'పాగల్ పంటి' లాంటి క్రేజీ సినిమాలో నటించింది కృతి కర్బందాకు స్టార్ ఇమేజ్ మాత్రం రావడం లేదు. కొంద‌రు హీరోయిన్ల‌కు ఎన్ని సినిమాలు చేసినా, ఎంత మంది స్టార్ హీరోల‌తో న‌టించినా ఎందుకో లక్ కలిసి రాదంటారు కదా ఈ పంజాబీ అమ్మడు ఆ కోవకే చెందింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ భామకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె పెట్టే ఫోటోలు కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంటాయి. త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం ఇప్పుడు కూడా కొన్ని సెగ‌లు పుట్టించే ఫోటో షూట్ చేసింది. ఇప్పుడు ఈ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ఫోటో షూట్ లలో ఈ భామ దూకుడు చూస్తుంటే ఇదే అందాల ఆర‌బోత‌తో మ‌రికొన్నాళ్లు ఇండ‌స్ట్రీలో దూసుకు పోయేలా క‌నిపిస్తుంది. ఇప్పటి నుండైనా అవకాశాలు మెండుగా వస్తాయేమో చూడాలి మరి.