Begin typing your search above and press return to search.

కృతి కర్బందా ఓపెన్ ఆఫర్.. మీదే ఆలస్యం

By:  Tupaki Desk   |   14 July 2021 3:33 AM GMT
కృతి కర్బందా ఓపెన్ ఆఫర్.. మీదే ఆలస్యం
X
తన అందంతో గిలిగింతలు పెడుతూ.. యూత్ కు నిద్ర లేకుండా చేసే సన్నజాజి కృతి కర్బందా తాజాగా అదిరే ఆఫర్ ఇచ్చారు. ఇప్పటివరకు మరే హాట్ హీరోయిన్ ఇవ్వని గోల్డెన్ ఛాన్సును తనను అభిమానించి.. ఆరాధించే వారికి ఇచ్చేశారు. దీనికి సంబంధించిన స్వీట్ న్యూస్ ను తనకు తానే పొట్టి వీడియోతో తెలిపారు. క్యూట్ గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ ఓపెన్ ఆఫర్ వింటే.. ఎవరికైనా ఒకసారి ట్రై చేద్దామన్న భావన కలుగక మానదు. ఇంతకూ ఆమె ఇచ్చిన ఛాన్స్ ఏమిటన్న విషయంలోకి వెళితే..

తాజాగా ఆమె ‘14 ఫేరే’ మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది కూడా. విశేషంగా అలరిస్తున్న ఈ ట్రైలర్ పుణ్యమా అని సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. దేవాన్షుసింగ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తే.. కృతి కర్బందా అతగాడితో జత కట్టారు. ఈ సినిమా ప్రమోషన్ ను మిగిలిన సినిమాలకు భిన్నంగా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద వినూత్నంగా ప్రజంట్ చేయటం కీలకంగా మారింది. సోషల్ మీడియాలో బజ్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా సినిమాకు హైప్ క్రియేట్ అవుతోంది.

తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక చిట్టి వీడియోను పోస్టు చేసింది కృతి. తన తాజా మూవీ ట్రైలర్ అందరికి నచ్చి ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆమె.. అందరూ తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయటం ఏం మజా ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేనా.. తన అభిమానులు ఎంతో ప్రత్యేకమని.. అందుకే రోటీన్ గా చేయకుండా వినూత్నంగా తమ అభిప్రాయాల్ని షేర్ చేయాలని కోరారు.

తాజా ట్రైలర్ లో తమకు నచ్చిన అంశాలేమిటో తెలియజేయాలని చెప్పారు. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్నే ప్రస్తావిస్తారో.. వారితో కలిసి తాను నేరుగా.. జూమ్ లో ఫేస్ టు ఫేస్గా మాట్లాడతానని చెప్పింది. ఈ ఓపెన్ ఆఫర్ ను ఎవరు సొంతం చేసుకుంటారో అంటూ కొంటెగా అడిగిన ఈ సన్నజాజి దెబ్బకు అంతా ఫిదా అయిపోతున్నారు. మరి.. ఆ లక్కీ ఛాన్స్ ను సొంతం చేసుకునే వారెవరో చూడాలి.